చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో స్వామి వివేకానంద సేవాసమితి బజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచి విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చిన భగత్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో భగత్ సింగ్ ప్రముకుడని విప్లవోద్యమ నాయకుడని, 23 ఏళ్లకే దేశంకోసం ఉరికంబాన్ని సైతం చిరునవ్వుతో ముద్ధాడుతూ మరెందరో స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచాడని తెలుపుతూ,వారి యొక్క జీవిత చరిత్రను నేటి యువత చదవి,వారియొక్క ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు బొడ్డు కృష్ణ,లోకోజి సతీష్ కుమార్,పత్తిపాక శ్రీనివాస్,ముక్క సందీప్,పాటి సుధాకర్ గొల్లపల్లి సాయికృష్ణ, మరియు చిన్నారులు పాల్గొన్నారు.