
ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు మరింత చేరువైన సేవలు
నూతన పోలీస్ స్టేషన్ ని సందర్శించిన… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో సుమారు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన పోలీస్ స్టేషన్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తొలిత మణుగూరు సబ్ డివిజన్ డిఎస్పి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఈ. బయ్యారం సీఐ శివప్రసాద్ , కరకగూడెం ఎస్సై రాజా రామ్ వారికి ఘన స్వాగతం పలికి పూల మొక్కలను అందజేయడం జరిగింది, అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలతో పోలీసులకు స్నేహపూరిత వాతావరణం నెలకొన్నదని దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేదని అన్నారు, శాంతి పద్ధతుల పరిరక్షించడంతోపాటు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు,ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విజయవంతంగా అమలవుతున్నదని ఆయన పేర్కొన్నారు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖలు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు…