425 కిలోల 93,00,000 లక్షల గంజాయి పట్టుకున్న శ్రీరాంపూర్ పోలీసులు

ఇద్దరు నిందితులు అరెస్ట్ ఒకటి ట్రాక్టర్ రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

*పట్టుకున్న నిందితుల వివరాలు

1. జగదంబు కిషన్ తండ్రి: దేవా క్షిసాని వయస్సు 22 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్ నివాసం: చిత్తపరి గ్రామం మల్కాన్గిరి జిల్లా, ఒడిస్సా రాష్ట్రం.

2. చిత్ర సీన్ క్షిసాని, తండ్రి దేవా క్షిసాని , వయస్సు 23 సంవత్సరాలు వృత్తి: వ్యవసాయం,
నివాసం: చిత్తపరి గ్రామం, మల్కాన్గిరి జిల్లా ఒడిస్సా రాష్ట్రం.

జైపూర్, నేటి ధాత్రి:

శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఐపీఎస్, డిఐజి అధికారులతో కలిసి పత్రిక సమావేశం ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించడం జరిగింది ‌.
శ్రీమతి రేమా రాజేశ్వరి, ఐపీఎస్, సిపి రామగుండం మీడియాతో మాట్లాడుతూ, తేదీ:23.092023 ఉదయం శ్రీరాంపూర్ పోలీస్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా, మందమర్రి ఎక్స్ రోడ్డు లో, జిఎం ఆఫీస్, శ్రీరాంపూర్ సమీపంలో అతను సిమెంట్ ఇటుకల ట్రాక్టర్ తో కూడిన నెంబర్ ప్లేట్లు లేని బ్లూ కలర్ లోడు ట్రాక్టర్ ఒకటి రోడ్డుపై నిలిచిందని ట్రాక్టర్ వద్ద డ్రైవర్ లేడని గుర్తించారు. ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేయడానికి మరియు సేఫ్ కస్టడీ కోసం, ఎస్ఐ మరియు అతని సిబ్బంది ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ కోసం ఎవరు పోలీస్ స్టేషన్ కి రాకపోవడంతో 25.09.2023 రోజున అనుమానంతో ఎస్ఐ ట్రాక్టర్ ని తనిఖీ చేయగా సిమెంటు ఇటుకల కింద దాచి ఉంచిన 93 బ్రౌన్ కలర్ టేపు చుట్టి ఉండిన గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. తరువాత, గెజిటెడ్ అధికారి సమక్షంలో శ్రీరాంపూర్ ఎస్సై పంచనామ నిర్వహించి, సుమారు 465 కిలోల బరువున్న గంజాయిw/Rs.93,00,000/-మరియు బ్లూ కలర్ ఐచర్ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్ను సోదా చెయ్యగా, చిత్ర సీన్ క్షిసాని, బలిమెల క్షిసాని,మల్కాన్ గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మరియు ఒక అమ్రేష్ ఫిల్లింగ్ స్టేఇన్ స్లిప్ లభించాయి.
వెంటనే టాస్క్ ఫోర్స్ రామగుండం మరియు శ్రీరాంపూర్ సర్కిల్ అధికారులతో ప్రత్యేక బృందాలని ఏర్పరిచి నిందితుల ఆచూకీ కోసం ఒడిస్సాలోని మల్కాన్గిరి జిల్లా బలిమెలకు పంపి, స్థానిక పోలీసు సహాయంతో మా ప్రత్యేక బృందం చిత్రసేన్ క్షిసాని (ట్రాక్టర్ యజమాని) మరియు జగబంధు (చిత్రసేన్ క్షిసాని సోదరుడు) అనే ఇద్దరు అనుమానితులను స్థానిక పోలీస్ స్టేషన్ కు పిలిపించి. తదనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్లో సంబంధిత రికార్డులలో అవసరమైన నమోదులు చేసిన తర్వాత మా బృందం అనుమానుతులను శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి దర్యాప్తు అధికారి అయిన శ్రీరాంపూర్ సర్కిల్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముందు హాజరు పరిచారు. సాంకేతిక ఆధారాలతో తదుపరి విచారణలో నిందితులిద్దరూ నేరం చేసినట్లు అంగీకరించారు. ఈశ్వర్, గురు క్షిసాని సూచనల మేరకు మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ ప్రాంతంలోని సాగు దారుల నుంచి గంజాయిని సేకరించినట్లు వారు నేరని ఒప్పుకున్నారు. తేదీ 21.09.2013 నా ఈశ్వర్, గురులు మహారాష్ట్రకు వెళ్లేందుకు ట్రాక్టర్ను అడిగారని, తలను గుణంగా వారు దానికి ఒప్పుకున్నారు. డిజిల్ నింపిన తర్వాత ట్రాక్టర్ ను గురు క్షిసాని, కి అప్పగించాడు. తేదీ 23.092013 నా గురు క్షిసాని,తన గ్రామానికి తిరిగి వచ్చి, మంచిర్యాల జిల్లాలో ట్రాక్టర్ ఆగిపోవడం గురించి అతనికి తెలియజేశారు. మరియు గురు క్షిసాని,తను మంచిర్యాలలోనే వాహనాన్ని విడిచిపెట్టి, చిటపరి గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలియజేశారు. గతంలోనూ మహారాష్ట్రకు కూడా గంజాయి రవాణా చేసినట్టు వారు అంగీకరించారు. పంచుల సమక్షంలో నేరంగీకార వాగ్మూలాలను నమోదు చేసిన తర్వాత దర్యాప్తు అధికారి నిందితులను అరెస్టు చేసి జూడిసిఎల్ రిమాండ్ కు పంపుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే…
నిందితులు ఈశ్వర్, గురు, జగబంధు, చిత్రసేన్ ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సరిహద్దు రాష్ట్రాలకు గంజాయిని తరలించి, విక్రయించి సొమ్ము చేసుకునేందుకు పధకం వేశారు. ఈ పథకంలో భాగంగా మల్కానికి జిల్లా ,చిత్రకొండ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేసి మహారాష్ట్రకు గంజాయిని రవాణా చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వారిపై అనుమానం రాకుండా, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సిమెంట్ ఇటుకల కింద గంజాయిని దాచి రవాణా చేసేవారు. ఈసారి కూడా గంజాయిని నెంబర్ పెట్టు లేని చిత్ర సీన్ క్షిసాని కి చెందిన ట్రాక్టర్లో సిమెంట్ ఇటుకల తో లోడ్ చేసి ఇటికల కింద బ్రౌన్ కలర్ అంటుకునే టేపుతో చుట్టి ఉంచిన గంజాయి ప్యాకెట్లను దాచారు. తేదీ: 22.09.2023 వారు తమ గ్రామం నుండి మహారాష్ట్రకు వెళ్లేందుకు ట్రాక్టర్లో బయలుదేరి, తెలంగాణ రాష్ట్రంలోకి, చెన్నూర్ మరియు జైపూర్ హైవే మీదుగా మహారాష్ట్ర రాష్ట్రంలోకి ప్రవేశించారు. మందమర్రి ఎక్స్ రోడ్డు వద్ద రాత్రి శ్రీరాంపూర్ కు చేరుకునేసరికి జిఎం ఆఫీస్ ఎక్స్ రోడ్ సమీపంలో ట్రాక్టర్ టైర్ పంచారు అయింది. అర్ధరాత్రి కావడంతో ట్రాక్టర్ను వదిలిపెట్టి, తిరిగి వచ్చేందుకు వెళ్లిపోయారు. విచారణలో నిందితులు గంజాయిని మహారాష్ట్రకు తరలించేందుకు ప్లాన్ చేసుకున్నట్లు అంగీకరించారు. ఇట్టి కేసులో తదుపరి విచారణ చేస్తున్నాం.
రామగుండం పోలీస్ కమిషనర్ నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన, శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐపీఎస్, డీసీపీ మంచిర్యాల, శ్రీ బి. మోహన్ ఏసీపి జైపూర్ మరియు అధికారులందరినీ అభినందించారు.
. శ్రీ సుధాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, టాస్క్ ఫోర్స్ రామగుండం
2. శ్రీ జి రమేష్ బాబు సిఐ ఆఫ్ పోలీస్ శ్రీరాంపూర్
3. శ్రీ ఎం ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ రామగుండం
4. శ్రీ యు.ఉపేందర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జైపూర్
5. శ్రీ కె .రాజేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీరాంపూర్
6. శ్రీ జి. రాజ వర్ధన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భీమారం
7. శ్రీ మల్లేష్, పోలీస్ టాస్క్ ఫోర్స్ రామగుండం
8. శ్రీ జి .సతీష్, పోలీస్ సిసిఎస్ మంచిర్యాల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!