
# శంకుస్థాపన చేయనున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
# ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి :
అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో నర్సంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజల ఆరోగ్య ఇప్పటికీ 450 పడకల జిల్లా ఆసుపత్రి పనులు చివరి దశకు చేరుకున్నాయి.కాగా పేద విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇటీవల మంజూరి చేసిన కేసీఆర్ ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణ పనుల కోసం ఇటీవల 183 కోట్ల రూపాయల నిదులను కేటాయిస్తూ జీవో-162 ను విడుదల చేసింది.దీంతో నేడు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల పనుల ప్రారంభం చేపట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన 450 పడకల జిల్లా ఆసుపత్రి దగ్గర మెడికల్ కళాశాల శంకుస్థాపన కార్యక్రమం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఉంటుందన్నారు. ముఖ్య అతిథిలుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు,వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపి మాలోత కవిత, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్,ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,బస్వరాజు సారయ్య,జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,అధికారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.అనంతరం నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నందు బహిరంగ సభ’ నిర్వహించనున్నట్లు,నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు,ప్రజలు హాజరు కావాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.