# మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలకు మరమ్మతులు
# పాఠశాలకు కరెంట్ ఫిట్ చేసి రంగులు పూసీ.. రిపేరు చేయడం గాలికి వదిలేశారు..
నర్సంపేట,నేటిధాత్రి :
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టినప్పటి సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ఇద్దరి విద్యార్థుల తలలకు గాయాలయ్యాయి ఈ సంఘటన నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో బుదవారం ఉదయం చోటుచేసుకున్నది.
నర్సంపేట పట్టణ కేంద్రంలో గల (బొందబడి) జిల్లా పరిషత్ మోడల్ పాఠశాలలో స్లాబ్ బాల్కానీలో పెచ్చులూడి పడి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. శిలావస్థలో ఉన్న పాఠశాల భవనం తరగతి గదిలోకి వెళ్లేందుకు లోపలికి వెళ్తున్న క్రమంలో స్లాబ్ పెచ్చులూడటంతో 7వ తరగతి చదువుతున్న మహిదర్,అజయ్ అనే ఇద్దరు విద్యార్థుల తలలకు దెబ్బ తగిలి తీవ్ర గాయాల పాలయ్యారు. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో మహేందర్ అనే విద్యార్థికి తలకు గాయం కాగా అజయ్ అనే మరో విద్యార్థికి తలనుదుటి భాగంలో దెబ్బతాకి గాయాలయ్యాయి. కాగా ఇద్దరు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వాపురం ప్రాంతానికి చెందినవారుగా ఉపాధ్యాయులు తెలిపారు.సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసపత్రికి చేరుకున్న కన్నీరు మున్నీరయ్యారు.
# మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలకు మరమ్మతులు..
కెసిఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం కోసం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. పలు పాఠశాలలో పనులు పూర్తి కాగా మరికొన్ని పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన జిల్లా పరిషత్ మోడల్ పాఠశాల(బొందబడి) మన ఊరు మనబడి కార్యక్రమానికి అర్హత పొందింది. ఎన్నో ఏళ్లు క్రితం నిర్మాణం ఐనా ఆ పాఠశాల నేడు శిధిలావస్థకు చేరుకున్నది. కార్పొరేట్ హంగులతో పునరుద్ధరణ చేయడం కోసం టెండర్ ద్వారా తగ్గించుకున్న సంబంధిత గుత్తేదారు కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసి ఫ్యాన్లు అమర్చారు. అలాగే పాఠశాల గోడలకు రంగులు అద్దారు.
అయినప్పటికీ శిధిలావస్థకు చేరుకున్న పాఠశాల ను రిపేర్లు చేయకుండా రంగులు అద్ది గాలికి వదిలేయడం వల్లనే పెచ్చులు ఊడి నేడు విద్యార్థులకు గాయాలయ్యాయని విద్యార్థి సంఘాల నాయకులు,విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
# అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి..
# శిబిలా వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ప్రమాదం పట్ల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ కోరారు.మనఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాల మరమ్మతులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.