* నివాళులు అర్పించిన బిజేపి నాయకులు
కోనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజాంబాద్ గ్రామంలో తొలి మలి తరం తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు, బహుజన నేత, ప్రజాస్వామికవాది శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నేడు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా బుధవారం ఈరోజు ఉదయం కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భగా బీజేపీ జిల్లా నాయకులు మష్ణం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమ సమయంలో వారి సేవలను మననం చేసుకున్నారు. భవిష్యత్ తరాలకు ఆయన పోరాటపటమ, రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకమనీ , అన్నారు.
స్వాతంత్ర సమరయోధుడు, తొలి మలిదశ పోరాట యోధుడని అలుపెరుగని వీరుడని మరియు నిత్యం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేవారని అన్నారు తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బాపూజీ గారు మనందరికీ స్ఫూర్తి ప్రదాత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దుర్గం తిరుపతి గౌడ్ , బడే నరసయ్య ,దుర్గం సాయిబు , బాస సామేలు, మాదాసు రాజేష్ , బంటు దిల్షాన్ మరియు దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.