ఎం. ఎల్. ఏ. వనమా–
మంగళవారం నాడు పాల్వంచ పట్టణంలో సుడిగాలి పర్యటనలు చేశారు.
సుమారు 15 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
వెంకటేశ్వర హిల్స్ కాలనీ,బాపూజీ నగర్, కాంట్రాక్టర్స్ కాలనీ, ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల ఆనందమే నా ఆనందం.
వారు జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలన్నదే నా కోరిక.
కొత్తగూడెం నియోజకవర్గం నా కన్నతల్లి లాంటిది.
పాల్వంచలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నా.
18 సంవత్సరాలు పంచాయతీ సర్పంచ్ గా, ఎమ్మెల్యే.గా మంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందా.
పాల్వంచలో పేదలకు 20 కాలనీలను నిర్మాణం చేశా.
1 లక్ష మందికి ఇల్లు కట్టించా. వేల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశా.
ఎక్కడ చూసినా నా అభివృద్ధి శిలాఫలకాలు కనిపిస్తాయి.
ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన నా అభివృద్ధి కనబడుతుంది.
చెప్పింది చేయడం చేసేది చెప్పడం వనమా నైజం.
కొత్తగూడెం అభివృద్ధి లో నాకు ఎవరు సాటి రారు.
కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలరుణం తీర్చుకునేందుకు శాయశక్తుల పనిచేస్తున్నా.
కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉంటా.
కొత్తగూడెం ప్రజల చిరకాల వాంఛలు ఎన్నో తీర్చా.
ప్రతి గడప గడపకు బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు.
కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు నాకు దేవుళ్ళు.
వారికోసం తుది శ్వాస వరకు పనిచేస్తా.
పాల్వంచ కొత్తగూడెం ప్రజలకు ప్రస్తుతం కిన్నెరసాని జలాలను అందిస్తున్న.
త్వరలోనే గోదావరి జలాలను అందిస్తా.
హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా పాల్వంచ కొత్తగూడెం జంట నగరాలుగా తీర్చిదిద్దుతున్న.
రెండు మున్సిపాలిటీలలో ఎక్కడ చూసినా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశా.
సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది.
కెసిఆర్ దయవల్ల మనం మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నాం.
ఒక సుందరమైన కలెక్టరేట్ ను ఏర్పాటు చేసుకున్నాం.
కెసిఆర్ లాంటి సీఎం దేశంలోనే ఇంకొకరు లేరు.
ఈ కార్యక్రమంలో *వనమా రాఘవేంద్రరావు, డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ఏ. స్వామి, మురళి, రాజేష్,పబ్లిక్ హెల్త్ .శ్రీనివాస్,పెద్దమ్మ గుడి చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్,పట్టణ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆచార్యులు, మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, సింధు తపస్వి, B నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు,వై.రమణ మూర్తి నాయుడు, కాల్వ ప్రకాశరావు, దాసరి నాగేశ్వరరావు, సకినాల రాము, డిష్ ప్రసాద్, దుర్గాప్రసాద్, నరేందర్ రెడ్డి,బండి చిన్న వెంకటేశ్వర్లు,రాజేశ్వరి,శేఖర్,నాగ, ఎలకా రామస్వామి, సమ్మయ్య, కొమ్మవరపు విజయ్,కొత్తపల్లి సోమయ్య, గుర్రం వెంకటరత్నం,నామా నవీన్ మరియు నవభారత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.