పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట్ మండల పర్యటనలో భాగంగా యాన్మన్ గండ్ల గ్రామంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ యం . శ్రీనివాస్ రెడ్డి తో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి .

గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాని ప్రారంభించారు. అలాగే గ్రామంలో నిర్మించబోయే మహిళ సమాఖ్య భవనం, చాకలి ఐలమ్మ భవనాని కి భూమి పూజలు నిర్వహించారు. యన్మన్ గండ్ల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన లంబోదరుడి పూజలో మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, పాల్గొన్నారు. అనంతరం వారికి ఘనంగా శాలువాలతో మాజీ సర్పంచ్ ఆశన్న, కోస్గి వెంకటయ్య, (మోటర్ )కోస్గి అరుణ్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట మండల నాయకులు యన్మన్ గండ్ల పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

> తెలంగాణ వచ్చాక గ్రామాల రూపురేఖలు మారాయి..

> కూచూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.

> గృహాలక్ష్మి లబ్ధిదారుల ఇండ్లకు శంకుస్థాపన.

తెలంగాణ వచ్చాకే ప్రతి గ్రామానికి రోడ్ల కనెక్టివిటీ పెరిగిందని పల్లెల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. నవాబుపేట మండలం కూచుర్ గ్రామంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ యం . శ్రీనివాస్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. గ్రామంలో అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుసాగారు .

కూచురులో గ్రామ పంచాయతీ భవనం, మహిళ సమాఖ్య భవనం, ముదిరాజ్ సంఘ భవనాలను ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులకు శంకుస్థాపన చేశారు.అంతకుముందు గ్రామ వాసి అయిన లింగయ్య కుటుంబానికి గృహాలక్ష్మి పధకంలో ఇల్లు మంజూరు కాగా ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బందులు తప్పయని, కరెంట్ ఇబ్బందులు కూడా తొలగాయన్నారు. పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలతో గ్రామాలకు మహర్థశ పట్టిందన్నారు. జరుగుతున్న అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరపాలని, పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలవాలని అన్నారు.

హజిలాపూర్ తండాలో.

నవాబుపేట్ మండలం హజీలపూర్ నుండి రాంసింగ్ తండా వరకు నూతన బీటీ రోడ్డు పనులకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ యం . శ్రీనివాస్ రెడ్డి తో కలసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి . అనంతరం రాంసింగ్ తండా పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *