
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
ఓ చలనచిత్రం షూటింగ్ నిమిత్తం జమ్మికుంటకు వచ్చిన నటుడు, హీరో సుమన్ జమ్మికుంట పట్టణ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన సుమన్ సిని హీరోను చూసేందుకు పలువురు పట్టణ ప్రముఖులతో పాటు ప్రజలు ఆసక్తి కనపరిచారు.