*కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి,
శాయంపేట నేటి ధాత్రి:
రాబోయే ఎన్నికల్లో మండల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి కోరారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగులో పాల్గొని మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లలో ధన బలానికి ప్రజాసేవకు మధ్య జరగనుందని గత 40 సంవత్సరాలుగా ఎలాంటి పదవులు లేకున్నా అనునిత్యం పేదల పక్షాన పోరాడుతూ వారి కష్టసుఖాల్లోపాలుపంచుకుంటున్న నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావుకు ప్రజలు మద్దతు పలికేలా ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలన్నారు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే సంక్షేమ పథకాలను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటికి తీసుకెళ్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక
భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గండ్ర సత్తన్న ఆదేశాల మేరకు మండల యూత్ కాంగ్రెస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది సాదు నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోకిల సుకుమార్ మిట్టపల్లి సతీష్ ఉపాధ్యక్షులుగా మునుకుంట్ల శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా ముసుకుల నరేష్ రెడ్డి కార్య నిర్వాహక కార్యదర్శిగా వల్లెపు దిలీప్ కార్యదర్శిగా మాందాటి తిరుమలేష్ కోశాధికారిగా లడే నాగరాజు కార్యవర్గ సభ్యులుగామల్సాని తిరుపతిరావు ఎడ్డే సుమన్ అనంతుల విజయ్ వంటేరు శ్రీకాంత్ లను ఎన్నుకున్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు మారేపల్లి రవీందర్, నిమ్మల రమేష్ ,రాజ్ కుమార్ ,రాజు ,కట్టయ్య ,శివ, సుమన్ తదితరులు పాల్గొన్నారు.