
లోహిత శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ…
కారేపల్లి, నేటి ధాత్రి.
కారేపల్లి : వారం రోజులపాటు అంగరంగ వైభవంగా వెంకీట్యా తండాలో నిర్వహించిన గణపతి ఉత్సవాల వేడుకలు సోమవారం ముగిశాయి. డీజే పాటలు, బంజారా డాన్సుల నడుమ గణేష్ మహారాజ్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిపారు. వినాయక ఊరేగింపులో పాల్గొన్న మహిళలకు లోహిత శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలు నాయక్ పంపిణీ చేశారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన గణనాధుని శోభాయాత్ర సాయంత్రం ఐదు గంటల వరకు అంగరంగ వైభవంగా సాగింది. మహిళల డాన్స్ లు చిన్నారుల కేరింతలు యువకుల కేరింతల నడుమ ఉత్సవానికి ముగింపు పలికారు. గ్రామంలో ఊరేగింపు అనంతరం కారేపల్లి సమీపంలోని బుగ్గ వాగులో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు జగన్ నాయక్, ప్రేమ్ కుమార్, రాహుల్, కుమార్, విష్ణువర్ధన్, రాకేష్, రాజేష్, ఇంద్రజిత్ నాయక్, హర్షవర్ధన్, అఖిల్, విక్రమ్, హేమంత్, మహిళలు తదితరులు పాల్గొన్నారు..