
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని శ్రీ గణపతి భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సలువాది సదానందం ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ గణపతి భవన నిర్మాణ కార్మికుల సంఘం ఘనపురం మండల యూనియన్ ఆధ్వర్యంలో తేదీ 26 మంగళవారం నుండి తేదీ 1 -10-2023 ఆదివారం వరకు భావన నిర్మ కార్మికులకు బంధు పిలుపునివ్వడం జరిగింది భవన నిర్మారంగములో పనిచేయుచున్న అనగా తాపీ వర్కర్స్ లేబర్ సెంట్రింగ్ ప్లంబింగ్ ఎలక్ట్రిషన్ పెయింటర్ కార్మికుల కందరికి గత కొన్ని సంవత్సరాల నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు లేబర్ కార్డులు అందటం లేదు అదే విధముగా పనిచేసే క్రమంలో కార్మికులు ప్రమాదాల బారిన పడితే మనం అందరూ ఒకే మాటపై ఉండి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కలిసికట్టుగా ఉద్యమించాలని తదితర సమస్యలను హక్కుల సాధన కోసం ఈ బందుకు పిలుపునివ్వడం జరుగుతుంది కావున కార్మిక వర్గం అంతా ఈ బందులో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము హక్కుల సాధన కోసం జరుగుతున్న ఈ బందులో అన్ని యజమాన్యాలు సహకరించగలరని మనవి హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఆదివారం రోజున గణపురం మండల కేంద్రంలోని అంగడి దగ్గర జరగబోయే కార్మికుల సమావేశములో మండల ప్రజా ప్రతినిధులు కార్మిక వర్గ అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలపడంతో పాటు బందును జరిగేలా జయప్రదం చేయవలసిందిగా మండల ప్రధాన కార్యదర్శి చింతలచెర్ల ఆనందం పెయింటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే ఖాసీం ఎలక్ట్రిషన్ అసోసియేషన్ అధ్యక్షులు చిర్ర మధు సెంట్రింగ్ అసోసియేషన్ అధ్యక్షులు జయపాల్ శ్రీ లక్ష్మీ గణపతి తాపీ వర్కర్స్ తరపున మనవి చేస్తున్నాను