
ఉత్సవ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్
దురిశెట్టి చంద్రమౌళి (చందు)
నడికూడ, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల సమితి రాష్ట్ర కో కన్వీనర్ మరియు వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి (చందు)ని చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకలలో భాగంగా ఉత్సవ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర చైర్మన్ అక్కరాజ శ్రీనివాస్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన దురిశెట్టి చంద్రమౌళి.ఆయన మాట్లాడుతూ ఈనెల 26న జరిగే వీరనారి చాకలి చిట్యాల ఐలమ్మ 128 వ జయంతి ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమానికి పార్టీలకి అతీతంగా కులాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా రజక సోదర సోదరీమణులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.