ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం

ప్రయివేట్ హాస్పత్రిలో వైద్యం

చేర్యాల నేటిధాత్రి…

చేర్యాల పట్టణ పరిధిలోని బండపల్లి కాలనికి చెందిన ముస్త్యాల ఐలయ్య అనే వ్యక్తి బండపల్లి కాలనీ నుంచి చేర్యాల పట్టణానికి ద్విచక్ర వాహనం మీదుగా వస్తున్న క్రమంలో శునకం అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పడం వల్ల ఐలయ్య కు బలమైన గాయాలు తగిలాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. అక్కడి వైద్యులు, సిబ్బంది క్షతగాత్రుడిని పట్టించుకోకుండా వైద్యం అందివ్వకుండా నిర్లక్ష్యం వహించడంతో. హాస్పటల్ కు తీసుకువచ్చిన స్థానికులే…తగిలిన గాయాలపై శుద్ధి చేసి బ్యాండెజ్ వేశారు. తదనంతరం క్షతగాత్రుడిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రోగుల పట్ల చేర్యాల ప్రభుత్వ హాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వహించడం పట్ల హాస్పిత్రిలో ఉన్న రోగులతో పాటు పలువురు ప్రజలు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *