నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో గౌడ కార్మిక సంఘం నూతన కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగగా మర్ధ సురేష్ గౌడ్ గెలుపొందారు.గ్రామంలో గౌడ కులస్థులకు 116 ఓట్లు ఉండగా మాజీ అధ్యక్షుడు
మర్థ సాంబయ్య గౌడ్ అధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.కాగా ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు మర్ధ సురేష్ గౌడ్ కు 61 ఓట్లు వచ్చి ప్రత్యర్థి మర్ధ రమేష్ గౌడ్ పై గెలుపొందారు.సురేష్ గౌడ్
ఈ ఎన్నికను మాజీ అధ్యక్షుడు మర్థ సాంబయ్య గౌడ్ ప్రకటించారు.
నూతనంగా విజయం సాధించిన సురేష్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన గౌడ కులస్తులు ధన్యవాదాలు తెలిపారు.గౌడ కులస్తుల హక్కుల కోసం,వారి హక్కుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గౌడ కార్మిక సంఘం అధ్యక్షునిగా మర్ధ సురేష్ గౌడ్ ఎన్నిక
