మహబూబాబాద్,నేటిధాత్రి:
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు రామసహాయం శ్రీధర్ రెడ్డిని పదవ తరగతి (1986-87 బ్యాచ్ )మిత్రబృందం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి ఊరికి,పాఠశాలకు చేసిన సేవలను కొనియాడారు.సన్మాన గ్రహీత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తన బాధ్యతను మరింత పెంచింది అని పుట్టిన ఊరు రుణం కొంత తీర్చుకునే అవకాశం ఉపాధ్యాయ వృత్తి ఇచ్చింది అని అన్నారు.ఈ సందర్భంగా కంబాలపల్లి పాఠశాలలోస్ఫూర్తి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్వము లో 6 వ తరగతిలో కొత్తగా చేరినటువంటి 60 మంది విద్యార్థులకు టై ,బెల్ట్ లను అందించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.రమేష్ బాబు మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి,స్ఫూర్తి ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సొంతం చేసుకున్నందుకు పాఠశాల ఉపాధ్యాయ బృందం తరపున శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మేకల కృష్ణయ్య,బొక్క వెంకట్ రెడ్డి,ఉపేందర్ రెడ్డి,మిత్రులు బిర్రు వెంకట్ నారాయణ,సంద శ్రీను,నర్సింహాచారీ,రమేష్,యాకయ్య,ఉపాధ్యాయులు వెంకట్రాం నర్సయ్య,గురునాధ రావు,ఉప్పలయ్య, శిబారాణి, తిరుపతి,సోమేశ్వర్,సతీష్,వనజ,కవిత లు పాల్గొన్నారు.