జడ్పీ చైర్పర్సన్
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం, సూర్యనాయక్ తండ గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీక అని వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి అన్నారు. సూర్య నాయక్ తండలో నిర్వహించిన తీజ్ వేడుకలకు జడ్పీ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ గిరిజన యువతులు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకునే పండుగ తీజ్ పండుగ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నడం ఆనందంగా ఉందన్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలను,సంప్రదాయాలనుకాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అనంతరం డప్పు వాయిద్యాల మధ్య మొలకల బుట్టలతో ఊరేగుంపు చేస్తున్న గిరిజన యువతులతో కలిసి జడ్పీ చైర్ పర్సన్ నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి , వైస్ ఎంపీపీ రాంశెట్టి లత లక్ష్మారెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ భూక్య రమేష్, ఉప సర్పంచ్ మాలోత్ వస్త్రమ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు లౌడ్య రవీందర్, పార్టీ సీనియర్ నాయకులు జరుపుల రెడ్యానాయక్, లింగ్య నాయక్, యువ నాయకులు దేవ్ సింగ్, మాలోత్ జోహార్, రమేష్, లౌడియా రవీందర్ ,మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.