రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో సుమారు పన్నెండు కిలోమీటర్ల మేర ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలతో నిర్మించే రోడ్డు పునరుద్ధరణ పనులకు చోప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెలిచాల గ్రామం నుండి గుడ్డేలుగులపల్లి, గట్టుబూత్కూర్, చిన్నఆచంపల్లి, ఆచంపల్లి గ్రామం వరకు రోడ్డు పునరుద్ధరణ పనులు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డు పునరుద్ధరణ చేపట్టడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో వెలిచాల గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ మామిడి తిరుపతి, వైస్ చైర్మన్ చాడ ప్రభాకర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, జెడ్పి కోఆప్షన్ సభ్యులు సుక్రోద్దీన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు