గిరిజనలుగా పుట్టడమే మేము చేసిన తప్ప.
సరైన రహదారి లేక ఒక నిండు ప్రాణం బలి.
గతంలో చిన్న పిల్లల ప్రాణాలు పోయినా దాఖలాలు ఎన్నో.
పేరుకే గిరిజన నాయకులు కానీ గిరిజనులను పట్టించుకోరు.
తల్లి మృతితో దిక్కుతోచని స్థితిలో చిన్నారులు.
బిఎస్ఎస్ ఎం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు కేంద్ర మినిస్టర్ దగ్గర నుంచి రోడ్లు కరెంటు అన్ని వసతులు కల్పించమని ఆర్డర్స్ తెచ్చిన అమలు చేయని అధికారులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాచలం టౌన్. బూర్గంపాడు మండలం సారపాక శివారు అటవీప్రాంతంలో ఉన్న శ్రీరాంపురం ఎస్టి కాలనీలో పాము కరిచిగిరిజన మహిళ మృతి.
పాము కరిచిన వ్యక్తిని అటవీ ప్రాంతంలో నుంచి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి సరైన రహదారి లేకపోవడంతో నానా అవస్థలు పడి హాస్పిటల్కు తీసుకు వెళ్లేసరికి చనిపోతున్న రు అని ఆవేదన చెందుతున్న గిరిజనలు.
గిరిజనులుగా పుట్టడమే మేము చేసిన తప్ప మాపై కనికరం చూపని అధికారులు నాయకులు ఇంకా ఎన్ని ప్రాణాలు బలిగొనాలో అర్థం కాని పరిస్థితి సరైన రోడ్డు కరెంటు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నాము ఆని గిరిజనులు గోసపెడుతున్నారు.
పేరుకే గిరిజన నాయకులు కానీ గిరిజనల గురించి ఆలోచించిన నాయకులే లేరు ఏ ఒక్క నాయకుడు గానీ అధికారులు గానీ మా సమస్యల పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఎవరైనా ఒకరు చనిపోతే అప్పుడు కొందరు నాయకులు అధికారులు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పటమే తప్ప ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు.?
మా సమస్యల గురించి బి ఎస్ ఎస్ ఎం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామిల్ దగ్గరికి వెళ్ళాము ఆయన కేంద్ర మినిస్టర్ దగ్గర నుంచి మా గ్రామ సమస్యల మీద లెటర్ తీసుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి భద్రాచలం ఐటిడిఏ పిఓ కి ఇవ్వటం జరిగింది.
మాకు రోడ్డు కరెంటు డ్రైను కట్టించమని ఆర్డర్స్ ఇచ్చిన రూ కానీ కిందిస్థాయి అధికారులు ఇంతవరకు మా గ్రామంలోని ఎటువంటి పనులు కూడా చేపట్టలేదు ఇలా నిర్లక్ష్యం చేయడం మూలాన ఎన్నో ప్రాణాలు పోతున్నాయి దయఉంచి అధికారులు నాయకులు మాకు రోడ్డు కరెంటు డ్రైన్ అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నాము.
జిల్లా కలెక్టర్.పెద్ద నాయకులు మా పై చొరవ తీసుకొని మా గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని శ్రీరాంపురం ఎస్టి కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.