గ్రామ సర్పంచ్ గౌస్యా అబ్దుల్లా.
మహబూబ్ నగర్ జిల్లా ;నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఇప్పటూరు గ్రామ సర్పంచ్ గౌస్యాబేగం, అబ్దుల్లా అన్నారు. సోమవారం నవాబుపేట మండలంలోని ఇప్పటూరు గ్రామంలో బస్టాండ్ చౌరస్తాలో సీసీరోడ్డు పనులను ఆయన ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం వలన కాలనీలు సుందరంగా మారుతున్నయని అన్నారు. గ్రామంలో కొంతమేర సిసి రోడ్లు పెండింగ్లో ఉన్నవి, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.ప్రస్తుతం గ్రామ పంచాయితీలు ప్రతి రోజు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయడం వలన గ్రామాల్లో ఎక్కడ కూడా చెత్త చెదారం కనిపించడం లేదని తెలిపారు.
> గ్రామ అభివృద్ధి మా లక్ష్యం.
> ఎంపీటీసీ నవనీత్.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని ఇందులో భాగంగానే సబ్ స్టేషన్, క్రిమిటోరియం, పల్లె ప్రకృతి వనం, ప్రైమరీ హాస్పిటల్, రైతు వేదిక,సీసీరోడ్ల కోసం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామాల్లో అనేక పనులు చేపడుతున్నట్లు ఎంపిటిసి నవనీత్ పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గౌస్యా అబ్దుల్లా ,ఎంపీటీసీ,నవనీత్, వైస్ చైర్మన్ భూపాల్ రెడ్డి,ఉప సర్పంచ్ దుబ్బ రవి కిరణ్,దేవదాయ కమిటీ చైర్మన్ ప్రకాష్, దుబ్బ ఆంజనేయులు, హరికృష్ణ, బి కృష్ణ, స్వామి, రవి, స్వామి, శివ, కృష్ణ, టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ యువకులు పాల్గొన్నారు.