– సర్వ సభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
– అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలి
– వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
-సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– నెక్కొండ మండల కేంద్రంలో త్వరలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం
– ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని స్థానిక ఎంపీడీవో ఆఫీస్ లో మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ముఖ్యంగా
వ్యవసాయం, విద్య, వైద్యం, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, రోడ్ల నిర్మాణం, ప్రధాన అంశాలని గత
మార్చి నెలలో జరిగిన పంట నష్టానికి గాను నెక్కొండ మండలానికి 6500 ఎకరాల పంట నష్టపోయినట్టు గుర్తించగా రూ.6 కోట్ల 50 లక్షల నిధులను మంజూరు చేయించి రైతులకు అందించడం జరిగిందని రాజకీయాలకు అతీతంగా రైతులందరికీ వంద శాతం పంపిణీ చేశామని
ప్రతిపక్ష పార్టీలు వారి యొక్క ఉనికి కోసం రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరమని పంట నష్ట పరిహారం చెక్కులు రాని రైతులకు వ్యవసాయంవీకరణలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి సబ్సిడీ పైన యంత్రాలను అందివ్వడం జరుగుతుందని నెక్కొండ మండలంలోని 39 గ్రామపంచాయతీల గ్రామం మరియు తండాలకు వీటి రోడ్లను సిసి రోడ్లను అత్యధిక నిధులు మంజూరు చేయడం జరిగిందని ఈ రోడ్లన్నింటినీ త్వారిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందని రూ.22 కోట్లతో నిధులతో నెక్కొండ మండలంలోని నాగారం మరియు చిన్న కొర్పోలు గ్రామాలలో బ్రిడ్జి చెక్ డ్యామ్ పనులను త్వరలో ప్రారంభిస్తాం అన్నారు. అంతేగాక మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని మండలంలో సమగ్రమైన శాశ్వతమైన అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి జ్వరాలు వ్యాపి చెందకుండా
వైద్యాధికారులు ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని రోగ నిర్ధారణ పరీక్షల కోసం
నర్సంపేట పట్టణంలో ఉన్న జిల్లా ఆసుపత్రిని మరియు టీ డయాగ్నస్టిక్ సెంటర్ ఉపయోగించుకొని ప్రజలకు సత్వర వైద్యం మరియు టెస్టులను అందించాలని వైద్యులకు పలు సూచనలు సలహాలు చేశారు. అభివృద్ధిలో నెక్కొండ ప్రధమంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్, జెడ్పిటిసి సరోజ హరికిషన్, నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము ,ఎంపిటిసిలు సంఘని సూరయ్య, కర్పూరపు శ్రీనివాస్, సుకన్య, రమాదేవి, ఎంపీడీవో శ్రీనివాసరావు, మండల అధికారులు , సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.