రాజన్న సిరిసిల్ల టౌన్ :నేటిధాత్రి
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయ సముదాయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు
అనంతరం డీఈఓ రమేష్ కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు దేవేంద్ర మాట్లాడుతూ ఈరోజు 4వ
రోజుకు చేరుకుందని మధ్యాహ్న భోజన కార్మికులకు
ప్రస్తుతం 1000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం అందిస్తున్నారని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్
అసెంబ్లీ సాక్షిగా 2000 వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించి ఇంతవరకు ఇవ్వలేదు అన్నారు. అదేవిధంగా
మెస్ బిల్లులు ఆరు నెలలు గడిచిన ఇంతవరకు
బిల్లులు అందలేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం కార్యదర్శి సంతోషి అంజయ్య లతా విజయ లావణ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.