రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో మహిళలకు ఆదరణ సేవా సమితి, రైజింగ్ సన్ యూత్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రుతుక్రమ అవగాహన కల్పించి ఉచిత సానిటరీ నాప్కిన్స్ అందించడం జరిగింది. ఈసందర్భంగా ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని రవి మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా రుతుక్రమ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను ఆరోగ్య సూచనలను తెలియజేయడం జరిగింది. చిన్న వయసులో గర్భసంచులను కోల్పోయిన మహిళలు పడుతున్న ఇబ్బందులను గురించి తెలియజేసి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన సూచనలను తెలియజేశారు.
ఈసందర్భంగా ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి, జిల్లా యువజన అవార్డు గ్రహీత గజ్జల అశోక్, రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆరోగ్యం పైన చైతన్యం కల్పించడం అభినందనీయం అన్నారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జేరిపోతుల నర్సయ్య, గల్ఫ్ జేఏసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుముల రమేష్, ఆదరణ సేవా సమితి సంస్థ సభ్యులు లావణ్య ,అనిత అంగన్వాడీ టీచర్లు గజ్జెల అంజలి, బతిని కనుకలక్ష్మి, ఆశా వర్కర్లు, యువజన సంఘం సభ్యులు జేరిపోతుల మహేష్, గజ్జెల నవీన్, జేరిపోతుల అజయ్, జేరిపోతుల వెంకటేష్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.