తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరికొండ రవీంద్ర చారి చేర్యాల
నేటిధాత్రి చేర్యాల: పట్టణంలో జరిగిన స్వర్ణకారుల సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరికొండ రవీంద్ర చారి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం స్వర్ణకారులను పట్టించుకోవడంలేదని వీరు వృత్తి కోల్పోయి జీవితాలు అగమ్య గోచరంగా గడుపుతున్నారని వీరిని ఆదుకోవాలి ప్రభుత్వం 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క స్వర్ణకారపింఛన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం స్వర్ణకారులపై దొంగ బంగారం రికవరీ కేసులు నుండి కాపాడాలని మరియు కార్పొరేట్ మనీ లాండరింగ్ షాపులను వారి దొంగ వ్యాపారాలు అరికట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సిద్దిపేట జిల్లా స్వర్ణకార సంఘం నాయకులు కాసుల కుమార్ చేర్యాల స్వర్ణకార సంఘం అధ్యక్షులు కాసుల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కాసుల మహేశ్వర్ కాసుల భరత్ వలబోజు శ్రీనివాస్ మధు సుదన్ కాసుల భాస్కర్ కమలాకర్ పాల్గొన్నారు