*బీఆర్ఎస్ పార్టీ మానాల ఇంచార్జు పెరుమండ్లు రాజ్ గౌడ్
వేముల ప్రశాంత్ రెడ్డి కి మద్దతుగా మానాలలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం
రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక కృషితోనే మానాల గ్రామంతో పాటు గిరిజన తండాల అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ మానాల ఇంచార్టు పెరుమండ్లు రాజ్ గౌడ్ అన్నారు. శుక్రవారం రుద్రంగి మండలం మానాల గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తు వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, సర్పంచ్లు,
నాయకులతో కలిసి పెరుమండ్లు రాజ్ గౌడ్ గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధిలో వెనకబడిన మానాల
గ్రామంతో పాటు గిరిజన తండాల అభివృద్ధికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకొని రోడ్లు, ఆసుపత్రి, పాఠశాలలు తీసుకువచ్చి అభివృద్ధి
చేస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి మానాల అభివృద్ధికి కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అండగా ఉండి రానున్న రోజుల్లో భారీ
మెజార్టీతో గెలిపిస్తామని గ్రామ ప్రజలు హామి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మూడు రోజుల పాటు ఉమ్మడి మానాలలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త సీఎం
కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మంగిలాల్, మోహన్,
నాయకులు, భాధనవేణి రాజారాం, నరేష్ నాయక్, గజన్లాల్, రాందాస్, రవి, భూక్య రాజు, నాయిని రాజేశం, భూమానాయక్, తిక్క భూమన్న, నరహరి,
లక్కాకుల రమేష్, మోహన్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.