
22న హైదరాబాదులో మహాధర్నా
చీకటిమామిడి లో పోస్టర్ ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:
కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 22న హైదరాబాద్ లో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న తెలిపారు శుక్రవారం మునుగోడు మండల పరిధిలోని చీకటిమామిడి గ్రామంలో మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22న చలో గీతన్న… చలో హైదరాబాద్ నినాదంతో కల్లుగీత కార్మికుల మహా ధర్నా ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వృత్తిలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని, సేఫ్టీ మేకులు ఇవ్వాలని, కల్లుగీత కార్మికులందరికీ వృత్తికి ఉపయోగపడే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలన్నారు. జీవో 5 ప్రకారం కల్లుగీత వృత్తి చేస్తున్న వారందరికీ లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. ఎక్స్గ్రేషియా యధావిధిగా కొనసాగిస్తూనే గీతన్న భీమా అమలు చేయాలన్నారు. ప్రతి సొసైటీ కి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన 439 సొసైటీల భూములకు ఫెన్సింగ్ చేయించాలని తాటి ఈత జీనుగు ఖర్జూర తదితర కల్లు ఇచ్చే పొట్టి చెట్లు నాటాలన్నారు. వీటితో పాటు అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కల్లుగీత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులుఉప్పల గోపాల్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులుకర్నాటి దశరథ,కుంట్ల బిక్షం,గొల్లపల్లి యాదయ్య,బొడ్డు అంజయ్య,అనంతుల లక్ష్మీపతి,అనంతుల లింగయ్య,పాలకూరి శ్రీను,పల్లె సాయిలు,కర్నాటి లక్ష్మమ్మ,స్వాతితదితరులు పాల్గొన్నారు.