మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసమే ఆరోగ్య మహిళ

క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన ఉండాలి

ముందస్తు పరీక్షలతో సంపూర్ణ ఆరోగ్యం

క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ

మందమర్రి, నేటిధాత్రి

మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ అన్నారు. మంగళవారం మందమర్రి పట్టణంలోని దీపక్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో విడతలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ పథకాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సిహెచ్ మానస అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం బాగుంటుందని అన్నారు. హెల్త్, న్యూట్రీషన్ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ ఎం నీరజ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో డయాగ్నస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్ సూక్ష్మ పోషక లోపాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్స్, కుటుంబ నియంత్రణ, రుతుస్రావ సమస్యలు, సంతానలేమి, మెనోపాజ్, లైంగిక వ్యాధులు, శరీర బరువు వంటి వ్యాధుల కోసం వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అంతేకాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వ్యాధులపై పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ సి మానస మాట్లాడుతూ, మహిళలకు క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రాథమిక లక్షణాలు ఉన్నట్లయితే తక్షణ వైద్య సహాయం పొంది మామూలు మనిషిలాగ స్వేచ్చగా జీవించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమం వారంలో ఒకరోజు నిర్వహిస్తామని వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి సేవలందిస్తామని తెలిపారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు మహిళలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి వైద్య సలహాలు పొందాలని సూచించారు. ఆరోగ్య మహిళ పథకాన్ని పట్టణ మహిళలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపాలిటీ మేనేజర్ నాగరాజు, డిప్యూటీ డిఎం, హెచ్ఓ డాక్టర్ విజయనిర్మల, గైనాకలిజిస్ట్ అరుణశ్రీ, వైధ్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్, ఎం ఎల్ హెచ్ పీ డాక్టర్ డైసీ, కమ్యూనిటీ హెల్త్ అధికారి రాం మూర్తి, హెచ్ఈఓ నాందేవ్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు ఎండి అబ్బాస్, బర్ల సదానందం, ఎండి మజార్, సాగర్ బాబు, జూల శ్రీనివాస్, మొగురం శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!