> జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా లో
వినాయక చవితి మరియు మిలాదున్నబీ సందర్బంగా పోలీస్ అధికారులకు జూమ్ మీటింగ్, జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ. నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
వినాయక చవితి మరియు మిలాదున్నబీ పాడగల స్నాధర్బంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
మాత పెద్దలతో యువతతో ప్రతి పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్ నందు ముందుగానే పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు.
సోషల్ మీడియా లో రూమర్లు పోస్ట్ చేసే వారిపై నిఘా ఉంచామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అనవసరమైన గొడవలు సృష్టిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించలని చెప్పారు.
సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెంచాలన్నారు.
అనుమతి మార్గంలోనే ఊరేగింపు జరిపేటట్లు చూడాలన్నారు.
ఊరేగింపు నందు డీజేలు ఉపయోగించరాదన్నారు.
ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతీసే మరియు రెచ్చగొట్టే బ్యానర్లు లేకుండా చూడమన్నారు.
ట్రాఫిక్ డైవర్షన్ లు, రోడ్ క్లోజర్స్ పై దృష్టి సారించాలన్నారు.
లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ప్రతి ఒక్క పోలీస్ అధికారి తన జాబ్ రోల్ క్లారిటీపై స్పష్టత ఉండాలన్నారు.
ఈ జూమ్ మీటింగ్ నందు అదనపు ఎస్పీ రాములు, ఆర్,అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డి ఎస్పీ మహేష్, డీసీఆర్ బీ, డి ఎస్పీ రమణ రెడ్డి, .బి ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ గౌడ్ మరియు ఎస్పీ సీసీ రామ్ రెడ్డి పాల్గొన్నారు.