ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టాలి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలను ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బట్టు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ దీక్షకు మద్దతుగా ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ రిలే దీక్షకు హాజరైన ఎం ఎస్ పి నియోజకవర్గ ఇన్చార్జ్ గాజుల బిక్షపతి మాదిగ దీక్షలను ప్రారంభించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు దీక్షలకు సంఘీభావం తెలిపినారు అనంతరం మాట్లాడరు.ఎస్సి వర్గీకరణ అంశంపై ప్రస్తుతం ఈ నెల 18నుండి 22వరకు జరుగుతున్న ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బిజెపి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే మేం పూర్తి మద్దతు ఇస్తామని పార్లమెంట్ సమావేశాలలో మేం బిల్లుకు మద్దతు తెలుపుతామని వారు తెలియజేయడం జరిగింది . అనంతరం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బట్టు విజయ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ..రానున్న రోజుల్లో వర్గీకరణ చేయకుండా మాదిగలను ఇంకా మోసం చేస్తే బీజేపీ నాయకులను మాదిగ వాడల్లో తీరుగానియ్యం అన్నారు ఈ పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి బిజెపి తన చిత్తశుద్ధి చాటుకోవాలనివారు డిమాండ్ చేశారు లేని క్రమంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేయడం జరిగింది వర్గీకరణ బిల్లు పెట్టకపోతే రానున్న ఎన్నికల్లో బిజెపికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు దీక్షకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి మేకల రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ అంతడుపుల సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ కాల్వ రాజేందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ పట్టణ కన్వీనర్ దోర్నాల భరత్ మాదిగ ఎమ్మార్పీఎస్ మోరంచ పల్లె గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎర్ర భద్రయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు కల్లెపల్లి కుమార్ నోముల సంతోష్. చింటూ రేణి కుంట్ల రాజకుమార్ కొయ్యడ ప్రభాకర్.కుమ్మరి అనిల్ చిలువేరు కవిత కడప ప్రియాంక కళ్ళపల్లి పూజ చిలువేరి వనిత చిలువేరి కార్తీక్.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి పిసిసి సభ్యుడు చల్లూరి మధు బుర్ర కొమురయ్య దాట్ల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ పిప్పల రాజేందర్ జిల్లా ఉపాధ్యక్షులు అంబాల శ్రీనివాస్.పృద్వి మహేష్ రాజు తదితరులు పాల్గొన్నారు