సూర్యపేట సూర్యుడు- జన నేత జగదీషుడు.

https://epaper.netidhatri.com/

`తెలంగాణ ఉద్యమ నాయకుడు.

`పేదల పెన్నిధి.

`నిర్భందాలను ఎదిరించి నిలిచిన ధీరుడు.

`పార్టీ ఆవిర్భావం నుంచి అడుగులు

`కేసిఆర్‌ కు అత్యంత సన్నిహితుడు.

`న్యాయవాది గా గుర్తింపు.

`తెలంగాణ ఉద్యమ కీలకపాత్ర దారి.

`తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రి పని చేశారు.

`ఉమ్మడి నల్గొండ జిల్లాను బిఆర్‌ఎస్‌ కంచు కోట చేశారు.

`తెలంగాణ విద్యుత్‌ వెలుగులు పంచుతున్నాడు.

`సూర్యపేటను సాగులో ముందు నిలిపాడు.

`నల్గొండ లో ఫ్లోరైడ్‌ రక్కసి లేకుండా చేశాడు.

https://epaper.netidhatri.com/

`సూర్యపేట ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాడు.

`అన్ని రంగాలలో సూర్యపేట అభివృద్ధి చేశాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

జనం నుంచి పుట్టిన నేత జగదీశ్వరుడు. జనం మెచ్చిన నేత జగదీశ్వరుడు. ఉద్యమం భుజాన మోసిన నేత జగదీశ్వరుడు. తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు పోరాటం చేసిన నాయకుడు జగదీశ్వరుడు. జనం లో ఒకడిగా, జనం కోసం ఒకడిగా, నల్లగొండ నుంచి మలి తరం ఉద్యమ నేతగా ఎదిగిన జనం గుండె చప్పుడు జగదీశ్వరుడు.

 ఒకప్పుడు సూర్యపేట అంటే సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటానికి పురిటిగడ్డ… ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి తోడుగా నిలిచిన గడ్డ.

 ఆ గడ్డపై మలిదశ తెలంగాణ ఉద్యమ వీరుడు, సూర్యపేటకు వెలుగు పంచుతున్న సూర్యుడు మంత్రి జగదీష్‌ రెడ్డి.. జన నేతగా ప్రజల గుండెల్లో నిలిచి, గెలిచిన నాయకుడు జగదీష్‌ రెడ్డి.  

తెలంగాణ ఉద్యమ నాయకుడు. పేదల పెన్నిధిగా ప్రజల చేత కీర్తింపబడుతున్నాడు . తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి పాలకుల నిర్భందాలను ఎదిరించి నిలిచిన ధీరుడు. బిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ కోసం అడుగులు వేశాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు అత్యంత సన్నిహితుడు. ఉన్నత విద్యావంతుడుగా, న్యాయవాది గా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణ ఉద్యమ కీలకపాత్ర దారిగా మారాడు. తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రి పని చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను బిఆర్‌ఎస్‌ కంచు కోట చేశారు. తెలంగాణ విద్యుత్‌ వెలుగులు పంచుతున్నాడు. సూర్యపేటను సాగులో ముందు నిలిపాడు.నల్గొండ లో ఫ్లోరైడ్‌ రక్కసి లేకుండా చేశాడు. సూర్యపేట ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాడు.

అన్ని రంగాలలో సూర్యపేట అభివృద్ధి చేశాడు.

 ఒకనాడు నల్లగొండ అంటే మంచినీటి కరువు. ఫ్లోరైడ్‌ రక్కసి. ఉమ్మడి నల్గొండ మొత్తం అదే పరిస్థితి.

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆంద్రప్రదేశ్‌ ఏర్పాటు నుంచి నల్గొండ జిల్లాకు కనీసం మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు కూడా నాటి పాలకులకు మనసు రాలేదు. అప్పటి జిల్లా నాయకులకు చిత్తశుద్ధి లేదు. ప్రజల మీద ప్రేమ లేదు. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న కాంక్షలేదు. ప్రజల బాగోగులపై శ్రద్ధ లేదు. అసలు జిల్లాను అభివృద్ధి చేయాలన్న తపనే లేదు. ఎంత సేపు రాజకీయాలు, పదవులు, కాంట్రాక్టులు, ఆధిపత్యాలు తప్ప ప్రజల బాగోగులు పట్టలేదు. 

సూర్యపేట జిల్లాలో ఆసరా పెన్షన్‌ లబ్ధిదారులు 39,753 మంది వున్నారు. అందుకు ప్రభుత్వం 650 . 4 0 కోట్లు కోట్లు ఖర్చు చేస్తోంది. సూర్యాపేట జిల్లాలో 59,927 రైతులకు రైతుబంధు ద్వారా 540.31 కోట్లు అందుతున్నాయి. సూర్యపేటలో వైద్య మౌలిక సదుపాయాల కల్పన, మెడికల్‌ కళాశాల ఏర్పాటు కు 700 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి 8425 మంది అందుకున్నారు. అందుకోసం 76 కోట్ల 58 లక్షలు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో ముఖ్యమంత్రి సహాయనిధి 5852 మందికి, 33 కోట్ల 89 లక్షలు అందించడం జరిగింది. సూర్యపేట సంక్షేమంలో ముందున్నది.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో సూర్యాపేట నియోజకవర్గం నంబర్‌ వన్‌గా నిలుస్తున్నది. కల్యాణలక్ష్మి పథకం కింద 8,857 మందికి రూ.80.77 కోట్లు, షాదీ ముబారక్‌ ద్వారా 572 మందికి రూ.5.06 కోట్లు అందించారు. 25,620 మందికి ఆసరా పింఛన్లు ప్రతి నెలా రూ.6.01 కోట్లు అందిస్తున్నారు. రూ.300 కోట్లతో ఇంటింటికీ తాగునీరు సౌకర్యం కల్పించబడిరది. మూసీ నీటి మురుగు నీటిని శుద్ధి చేసి అవే అమృతం అన్నట్లు గత పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. కానీ సూర్యాపేట ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన కృష్ణా నీటిని అందిస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు 113 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలోని ఆవాసాలకు రూ.300 కోట్లు ఖర్చు చేసి శుద్ధి జలాలను సరఫరా చేస్తున్నది.

సాగు సస్యశ్యామలం.

సూర్యాపేట నియోజకవర్గానికి భౌగోళికంగా విశిష్టమైన ప్రాధాన్యత వుంది. అటు గోదావరి, ఇటు కృష్ణా నీటిని అందించే అవకాశం వుంది. ఇక మూసీ నది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా సమైక్య పాలకులు ఉమ్మడి నల్గొండ జిల్లా కు, సూర్యపేటకు నీటి సదుపాయం కల్పించడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ మేమే పెద్ద నాయకులమని చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు కూడా చేష్టలుడిగి చూశారు. పదవులకు ఆశపడ్డారు. ప్రజా ప్రయోజనాలు తకట్టుపెట్టారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. పదవుల మీద వున్న ధ్యాన ప్రజలమీద, ప్రగతి మీద పెట్టలేదు. కనీసం మంచి నీళ్లు ఇచ్చేందుకు కూడా చేతులు రాలేదు. మనసే రాలేదు. తెలంగాణ వచ్చింది. కొట్లాడిన నాయకుడు జగదీశ్‌ రెడ్డి మంత్రి అయ్యారు. నల్లగొండ తలరాత మార్చారు. ఉమ్మడి నల్గొండ ను బంగారు తునక చేశాడు. సూర్యపేట నియోజకవర్గం సస్యశ్యామలం చేశాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఉమ్మడి నల్గొండ తో పాటు సూర్యపేట ను తీర్చి దిద్దారు. ముందుగా చెప్పుకున్నట్లు సూర్యపేటను మూడు నదుల నీళ్లతో కళకళలాడేలా చేశారు. గోదావరి జలాలు, కృష్ణా జలాలు సూర్యపేట లో పరవళ్ళు తొక్కేలా చేశాడు. కాళేశ్వరం జలాలను సూర్యాపేట జిల్లాకు తీసుకొచ్చారు. ఆ నీటితో ఆత్మకూర్‌(ఎస్‌), చివ్వెంల, పెన్‌పహాడ్‌ మండలాల సాగును పండగ చేశాడు. ఏటా రెండు పంటలకు నీళ్లందిస్తున్నారు. సూర్యాపేట మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టు గేట్ల తుప్పు పట్టి, రంద్రాలు పడి నీరు వృధాపోయినా నాడు గత పాలకులు, నల్గొండ నాయకులు పట్టించుకోలేదు. జగదీష్‌ రెడ్డి మంత్రి అయ్యాక రూ.20 కోట్లతో గేట్లు ఏర్పాటు చేశాడు. చుక్క నీరు వృధా కాకుండా చేశారయ. అంతేకాకుండా రూ.66 కోట్లతో కాల్వల ఆధునీకరణ పనులు పూర్తి చేయించారు. నిరంతరం కాలువల్లో నీరు పారిస్తున్నారు. అప్పటి నుంచి మూసీ నది ఒక్కసారి నిండితే రెండు పంటలకు సాగు నీరు పుష్కలంగా సరిపోతుంది. మూసీ, పాలేరు వాగులపై రూ.160 కోట్లతో కొత్తగా 24 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. దాంతో పరిసర ప్రాంతాలలో గణనీయంగా భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లకు పుష్కలమైన నీరు అందుతోంది. అటు ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్‌, ఇటు పుష్కలంగా భూ గర్భ జలాలు, మరో వైపు కాలువలు ఎటు చూసినా సూర్యపేట నిత్య నూతనత్వాన్ని సంతరించుకున్నది. ఎప్పటికప్పుడు కొత్త ముచ్చట చెప్పుడు తప్ప, ఎస్సారెస్పీ కాల్వల మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేయమని ప్రజలు ఎంత కోరినా నాడు కనికరించలేదు. మంత్రి జగదీష్‌ రెడ్డి రాగానే రూ.10కోట్లు ఖర్చు చేసి, కాలువలకు నూతనత్వం తెచ్చారు. దానికి తోడు రూ.3 కోట్లతో 21 లిఫ్ట్‌ల మరమ్మతులు చేపట్టి పూర్తి చేశారు. మిషన్‌ కాకతీయ పథకం కింద రూ.72 కోట్లతో 231 చెరువులకు పునరుద్ధరించి, పూర్వ వైభవాన్ని తెచ్చారు. ఉమ్మడి పాలకులు తట్టెడు మట్టి తీయమన్నా తీయలేదు. కనీసం చెరువుల మరమ్మత్తులు చేయమన్నా ఉమ్మడి పాలకులు పెడచెవిన పెట్టారు. తెలంగాణ వ్యవసాయం చిన్నాభిన్నం చేశారు. తెలంగాణ రైతును నిర్వీర్యం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతును రాజును చేసింది. ఏటా రెండు సార్లు రైతు బంధు అందిస్తోంది. రైతు సాగు వాటులోనే దిగాలు పడకుండా చూస్తోంది. అప్పల పాలు కాకుండా రైతును కడుపులో పెట్టుకొని కాపాడుకుంటోంది. ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చి, రైతుకు ఎప్పుడు వీలైతే అప్పుడు పొలానికి నీరుపెట్టుకునే అవకాశం కల్పించారు. ఆఖరుకు పండిన పంటను రైతు కళ్లాల దగ్గరే ప్రభుత్వమే కొనుగోలు చేసి, దళారులు లేకుండా పంట పైసలు బ్యాంకులో జమ చేస్తోంది. ఇలాంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. తెలంగాణ సాధించి, రైతు రాజ్యం తెచ్చిన ప్రభుత్వంలో మంత్రిగా తమ సూర్యపేటను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపిన మంత్రి జగదీష్‌ రెడ్డి ని ప్రజలు వేనోళ్ళ కొనియాడుతున్నారు. జగదీష్‌ రెడ్డి నాయకత్వమే సూర్యపేట కు శ్రీరామ రక్ష అంటున్నారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా అలుపెరుగని పోరాటం చేసిన జగదీశ్‌ రెడ్డి కన్నా సూర్యపేటలో అంకిత భావం వున్న నాయకుడు ఎవరుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!