కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బావండ్లపల్లి బాలరాజు
రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా
సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి ఉత్సవాల సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బావండ్లపల్లి బాలరాజు మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితమే దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. ఆయన గౌడ కులంలో పుట్టినప్పటికీ అణగారిన వర్గాలకు నాయకత్వం వహించి బహుజనులు ఐక్యం చేసి 12 మందితో మొదలుపెట్టి 12000 సైనికకులను ఏర్పాటుచేసి కిలాశాపుర్ నుంచి మొదలుకొని గోల్కొండ కోటను జయించి రాజ్యమేలిన యోధుడు అని కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువకులంతా ముందుకు రావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం మండల కోశాధికారి మునుకుంట్ల లెనిన్,వైస్ యంపిపి నాగటి ఉపేందర్,మత్స్య కార్మిక సంఘం చైర్మన్ కందుల హనుమంతు, పల్లె సత్యం, కల్లూరు జంగయ్య, పబ్బు స్వామి,అంతటి సత్తయ్య, గోపగోని ధర్మరాజు ,కునూరు నరసింహ స్వామి ,మామిండ్ల రవి, కొండ మల్లయ్య ,బోయపల్లి శ్రీశైలం, కొండూరు వెంకటేశం,ఆముద ఆంజనేయులు, రాసాల రమేష్ పాల్గొన్నారు.