
భూపాలపల్లి నేటిధాత్రి
మన ఊరు మన రమణన్న కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ గ్రామంలో పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మండలం కమలపూర్ ఆముదాలపల్లి గ్రామాలలో ఉదయం పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర ఆముదాలపల్లి గ్రామంలో స్థానిక ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు.
గ్రామములో ఉన్నటువంటి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
పోడు భూములకు గ్రామంలోని రైతులకు హక్కు పత్రం కావాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు
గిరివికాస పథకం క్రింద గ్రామంలో 6 బోర్లు వేశామని ఎమ్మెల్యే రైతులకు వివరించారు
గ్రామంలో 13కరెంట్ పోల్స్ కావాలని కోరగా, విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు.వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు.
గ్రామంలో రైతులు పామ్ ఆయిల్ పంటకు చేయుతనివ్వాలని తెలుపగ, మొక్కల పెంపకం కోసం 50% రాయితితో అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.
ఆముదాలపల్లి గ్రామంలో ఉన్న సమస్యలని వెంటనే పూర్తి చేస్తానని తెలిపిన ఎమ్మెల్యే కి స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
గ్రామంలో పాఠశాల శిథిలావస్థకు చేరగా వెంటనె నూతన భవనానికి నిధులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు
గ్రామ పంచాయతీ భవనం కోసం వెంటనే మంజూరు ఇస్తానని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు