కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్
15వ వార్డులో ఆది శ్రీనివాస్ సందర్శన
వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 15వ వార్డు బాలనగర్ ను శుక్రవారం జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ వార్డు ప్రజలతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. నిత్యవసర ధరలు పెంచి ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే సిలిండర్, రకాల నిత్యవసర వస్తువులు, నిరుద్యోగ భృతి, 4016 పెన్షన్ తో పాటు అనేక సంక్షేమ పథకాలతో ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో చేతు గుర్తుపైనే ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమురయ్య, కనికరపు రాకేష్, గంట్యాల ప్రకాష్, మండలోజు సందీప్, మెరుగు సత్తయ్య, సుందర్ రెడ్డి, కాసారం చంద్రయ్య, బరి బద్దల రవి, పొలాస రాజేశం, ఎలగందుల రాజేందర్, ధూమ్ పెట్టి నరసయ్య, బూరుగు అరుణ, చింతకింది లలిత, మెండ భారతి, మరియు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.