కాంగ్రెస్‌ లో జోష్‌ మాయం!

https://epaper.netidhatri.com/

` సీనియర్లు దూరం,దూరం!

` పార్లమెంటు సమావేశాల పేరుతో రేవంత్‌ మౌనం!

`గాంధీ భవన్‌ లో తగ్గిన హడావుడి!

https://epaper.netidhatri.com/

`అసెంబ్లీ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్‌ ను కడిగేసిన ప్రభుత్వం!

`ప్రజల్లోనే కాదు, కాంగ్రెస్‌ నేతల్లోనే మొదలైన అంతర్మధనం!

`బిఆర్‌ఎస్‌ ను ఢీ కొట్టే శక్తిపై డోలాయమానం!

`గతంలో రేవంత్‌ వ్యాఖ్యలతో బిఆర్‌ఎస్‌ రాజకీయం.

https://epaper.netidhatri.com/

`సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్‌ సతమతం?

`ఇప్పట్లో కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కావడం కష్టం!

`ప్రజలకు ఇంకా కేసిఆర్‌ నాయకత్వంపైనే నమ్మకం!

`కాంగ్రెస్‌ మాటలు వినడానికి సిద్ధంగా లేని జనం!

`తెలంగాణలో ఈసారి కూడా కాంగ్రెస్‌ గట్టెక్కడం అసాధ్యం!

హైదరబాద్‌,నేటిధాత్రి:                         

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమిటో ఆ పార్టీకే అంతు చిక్కడం లేనట్లు వుంది. ఆ పార్టీ పరిస్ధితి చూస్తే అందరూ లీడర్లే. కాని క్యాడర్‌ లేదు. అందరూ ముఖ్యమంత్రులే కాని పార్టీ కోసం ఎవరూ పని చేయరు. పార్టీ గెలిస్తే మాత్రం ముందు వరుసలో వుంటారు. పార్టీ గాలిలో గెలిస్తే నేనేంటే నేనే అని ముందుకొస్తారు. అందరూ ధీరులే..కాని యుద్ద రంగంలో ఆయుధాలు పడేసేవారే! అందుకే పిసిసి. అధ్యక్షుడిగా రేవంత్‌ను తెచ్చుకున్నారు. ఆనాటి నుంచి ఇంకా చిక్కులు ఎదుర్కొంటున్నారు. అంతకు ముందు కనీసం ప్రజల్లో పలుకుబడి అయినా వుండేది. రేవంత్‌ వచ్చాక సీనియర్లకు విలువ లేకుండాపోయింది. కాంగ్రెస్‌ పార్టీ అంటే ఇప్పటి వరకు వున్న సానుభూతి మొత్తమే పోయింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు వస్తుందన్న గ్యారెంటీ సీనియర్లుకు లేకుండాపోయింది. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి మెజార్టీ సీట్లుకు ఎసరు పెట్టేశారన్నది పార్టీలో చెప్పుకుంటున్న మాట. ఆశావహులకు లేని పోని ఆశలు కల్పించి, వచ్చిన వాళ్లందరికీ నీకే టిక్కెట్‌ అని అసలు పార్టీ ఉనికే లేని చోట కూడా టికెట్టు ఖరారు చేశాడంటున్నారు. సహజంగా నాయకులందరికీ ఏమో..గుర్రమెగరా వచ్చు..అన్న ఆశ వుంటుంది. ఒక వేళ గాలొస్తే గెలుస్తా? అన్న ఆలోచన వున్నవాళ్లకు రేవంత్‌ ముందే ఆశలు కల్పించాడని సమాచారం. అందుకే సీనియర్లందరినీ ఆది నుంచి దూరం పెడుతూ వచ్చాడు. అయితే రేవంత్‌ అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ గ్రాఫ్‌ పెరిగిందేమీ లేదు. కనీసం గతంలో వచ్చిన ఓట్లు కూడా ఎక్కడా రాలేదు. రేవంత్‌ పిసిసి కాకముందు ప్రచారం చేసిన చోట్ల కూడా కాంగ్రెస్‌ గెలిచింది లేదు. అంటే రేవంత్‌ రెడ్డి ఎక్కడ కాలు పెడితే అక్కడ పార్టీ ఖతమే అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ పరిసి ్ధతి అదే అన్నది తేలిపోతోంది. రేవంత్‌ వల్ల పార్టీ పెరిగేదేమీ లేదన్నది సీనియర్లందరకీ ఇప్పుడు తెలుస్తోంది. కొందరు ఆది నుంచే వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇప్పటికీ రేవంత్‌పై కారాలు మిరియాలు నూరుతున్నవారే ఎక్కువ. 

 కర్నాటక ఎన్నికల ఫలితాలో కాంగ్రెస్‌లో వచ్చిన జోష్‌ కూడా రేవంత్‌ మూలంగానే చల్లబడిరదన్న మాటలు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. 

గతంలో కాంగ్రెస్‌ బలంగా వుందని చెప్పడానికి, చెప్పించడానికి గాంధీ భవన్‌ ముందు హంగామాలు వుండేవి. అవి బాగా ప్రచారానికి ఉపయోగపడేవి. కాని రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత అలాంటి వ్యవహరాలు రేవంత్‌ ఇష్టపడడం లేదు. ఎందుకంటే రేవంత్‌కు ఇప్పటికే సీనియర్లు ముందు ఒక మాట…వెనకొక మాట మాట్లాడుతున్నారు. నోటితో మాట్లాడుతూ నొసటి వెక్కిరిస్తున్నారు. ఇక జిల్లాల నుంచి, మండలాలనుంచి కూడా నాయకులు, కార్యకర్తలు వచ్చి డౌన్‌…డౌన్‌ అంటే ఉన్న పదవి కూడా పోతుందన్న భయం రేవంత్‌లో పట్టుకున్నది. గతంలో గాంధీ భవన్‌ ముందు స్లోగన్లు కూడా పార్టీ పెద్దలు గతంలో ఇంపుగానే వినేవారు. కాని రేవంత్‌ రెడ్డి అసలు ప్రశ్నించడమే వద్దనుకుంటున్నారు. పార్టీ కార్యాలయం ముందు గలాటానే వందంటున్నాడు. అంటే పార్టీ ఎదగడం, ఇతర నేతలకు జిందాబాద్‌లు కొట్టడం, తనను డౌన్‌, డౌన్‌ అనడం రేవంత్‌ కోరుకోవడం లేదు. ఇదిలా వుంటే ఇటీవల రేవంత్‌రాష్ట్ర రాజకీయాలు వదిలేసి, డిల్లీ పార్లమెంటు సమావేశాల పేరుతో అక్కడే మకాం వేశారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ప్రతి క్షణం ఎంతో ముఖ్యం. ఎన్నికలకు సమయం చాలా తక్కువగా వుంది. కాని రేవంత్‌ రెడ్డిలో సీరియస్‌ నెస్‌ కనిపించడం లేదు. మరో వైపు రాష్ట్రంలో వుంటే లేని పోని తలనొప్పులు అనుకుంటున్నారో..ఏమో! ఈ మధ్య యాత్రల పర్వం సాగిస్తున్నాడు. ఆ మధ్య అమెరికాకు వెళ్లి ఓ మాట వదిలేశాడు. రాజకీయం మొత్తం తన చుట్టూ తిప్పుకున్నాడు. ఇప్పుడు తాను లేని సమయంలో కాంగ్రెస్‌ రాజకీయమే కనిపించొద్దన్న తరహాలో వ్యవహరిస్తున్నాడు. ఈ మధ్యే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ ప్రజలు కూడా కాంగ్రెస్‌ను పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా సభా సమావేశాలను పట్టించుకోలేదు. ఇదే అదును చూసుకొని మంత్రి కేటిఆర్‌ కాంగ్రెస్‌ సభ్యులను ఓ ఆట ఆడుకున్నాడు. అసెంబ్లీలోనే వారి పరువు మొత్తం తీసేశాడు. కాంగ్రెస్‌ పార్టీకి కనీసం రాజకీయ పార్టీ అన్న సోయి కూడా లేదన్నంతగా కేటిఆర్‌ ఉతికి ఆరేశాడు. కనీసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కౌంటర్లు కూడా ఇచ్చుకోకుండా చేశాడు. అందులో రేవంత్‌ రెడ్డి వ్యవహారం తీసుకొని కాంగ్రెస్‌ పార్టీని కేటిఆర్‌ చీల్చి చెండాడాడు. 2014లో టిడిపి ఎమ్మెల్యేగా వున్న రేవంత్‌ రెడ్డి , అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీ ప్రభుత్వాల పనితీరును, తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ వ్యవహార శైలిని ఏ విధంగా తూర్పారపట్టాడో మొత్తం కేటిఆర్‌ వినిపించాడు. కాంగ్రెస్‌ సభ్యులకు మారు మాట లేకుండా చేశాడు. 

 అసెంబ్లీ చివరి సమావేశాలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోనే కాదు, ప్రజల్లో కూడా కొంత అంతర్మధనం మొదలైనట్లే కనిపిస్తోంది. 

ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ వ్యవహార శైలి ఎలా వుంటుందన్నదానిపై ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌లు పూస గుచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు ఉద్యమ సమయంలో అప్పటి నాయకులు ఏం చేశారన్నదానిపై ముఖ్యమంత్రి కేసిఆర్‌ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. అసలు కాంగ్రెస్‌ పార్టీ 2004 ఎన్నికల ముందు గెలిచే పరిస్ధితి లేదని తెలిసే ఆనాడు బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ గుర్తు చేశారు. అప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌నేతల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి కేసిఆర్‌ వారికి చురకలంటించారు. అసలు తెలంగాణ కావలని కాంగ్రెస్‌ నేతలు బలంగా అడిగింది లేదు. సీమాంధ్ర నాయకులను అడ్డుకున్నది లేదు. ఇదే అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్ర ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క పైస ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి! అంటే ఒక్క కాంగ్రెస్‌ నాయకుడైనా ప్రశ్నించాడా? సీమాంద్ర ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తుంటే, కొందరు వారితో పాటు వంత పాడిన వారున్నారు. అలాంటి నాయకులు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయలేదు. కనీసం సీమాంధ్ర నాయకుల నోరు మూయించలేదు. తెలంగాణ ప్రకటన చేసి, వెనక్కి తీసుకున్న తర్వాత యువత పిట్టల్లా రాలిపోతుంటే ఆ పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లి ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు. ఇలాంటి నేతలను తెలంగాణ ప్రజలు నమ్ముతారా? అంటూ సిఎం కేసిఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. కాంగ్రెస్‌ పార్టీకి ఆ కాస్తో కూస్తో వున్న సానుభూతిని లేకుండా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌నేతలు మాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి? అని అడిగినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ ఉమ్మడి రాష్ట్రంలో 40 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. తెలంగాణ కాంగ్రెస్‌నాయకులకు చిత్త శుద్ది వుంటే ఏనాడో తెలంగాణ బాగు పడేది. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ పదేళ్లలో తెలంగాణ పరిపూర్ణమైన వికాసాన్ని సొంతం చేసుకున్నది. ఎవరూ ఊహించనంత అభివృద్దిలో దూసుకుపోతోంది. ఇప్పుడు వచ్చి మాకు ఒక్క ఛాన్స్‌ అంటే, అందులోనూ రేవంత్‌ రెడ్డి అధ్యక్షుడుగా వుండగా ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడం అన్నది జరక్కపోవచ్చు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం వద్దనుకుంటే తెలంగాణ మళ్లీ పాత రోజులకు వెళ్లిపోయే పరిస్ధితి రావొచ్చన్న మాటలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!