అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కేసీఆర్ పరిపాలన
బి.ఆర్.ఎస్.ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న ప్రతిపక్షాలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు
– ఎమ్మెల్యే చల్లా
పరకాల నేటిధాత్రి(టౌన్)
కనుమరుగవుతున్న కుల వృత్తులకు ప్రోత్సాహం అందించాలనే సదుద్దేశంతో కుల వృత్తుల చేయుతకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఘనత సిఎం కేసీఆర్ దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.గురువారం నియోజకవర్గంలోని పరకాల మున్సిపాలిటీ,పరకాల,నడికుడ,ఆత్మకూరు,దామెర, గీసుగొండ ,సంగెం మండలాలకు చెందిన 300 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే లక్ష రూపాయల సహాయ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ
ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మన రాష్ట్ర సంక్షేమ పథకాలు నిలిచాయి.సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని.తెలంగాణ ప్రజల కళలను సాకారం చేయడానికి సిఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు.70 ఎండ్లకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎంచేసిదని అని ప్రశ్నించారు.కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా సంక్షేమంకోసం సంక్షేమ పథకాలు,రైతాంగ పురోగతి రైతు సంక్షేమ పథకాలు,కనుమరుగవుతున్న కులవృత్తుల ప్రోత్సాహకాలు అందిస్తూ వారికి అండగా నిలిచింది కేసీఆర్ గారొక్కరెనన్నారు.గత ప్రభుత్వాల హయాంలో వలసలు వెళ్లిన ప్రజలను రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తూ తిరిగి స్వరాష్ట్రంకి తీసుకువస్తున్న ఘనత బి.ఆర్.ఎస్.ప్రభుత్వానిది.అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని.గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ చేస్తే వ్యవసాయం ఒక పండుగల చేసిన ఘనత కేసీఆర్ దని.రైతులకు 24 గంటల కరెంటు,పంటపెట్టుబడి, రైతుబీమ, రైతుబందు,అందుబాటులో ఎరువులు అందిస్తూ వారికి అండగా ప్రభుత్వం నిలిచింది.నిరుపేద కుటుంబంలోని ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.100116/- అందించిన ఘనత సిఎం కేసీఆర్ దని.70 ఎండ్లు ఏమిచేయలేని కాంగ్రెస్ పార్టీ మళ్లీ కల్లబొల్లి మాటలతో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారు.ప్రజల అప్రమత్తంగా ఉండాలి,అనునిత్యం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా కేసీఆర్ వెంట మనమందరం నడవాలి.ప్రతిపక్ష పార్టీల కుట్రలు తిప్పికొట్టాలి.త్వరలోనే దలితబందు అందిస్తాం,అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపచేస్తామని అది నిరంతర ప్రక్రియ అని ప్రజలు అసత్య ప్రచారాలు నమ్మి ఆందోళన చెందవద్దని తెలిపారు.కుల వృత్తుల ఆర్థిక సహాయం పొందిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,మార్కెట్,సొసైటీ చైర్మన్లు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.