విశ్వవిఖ్యాత నట గాయక సార్వభౌమ పోరిక శ్యామల్ నాయక్ గారికి జన నీరాజనాలు

సకల కళల శ్యామసుందరుడు డాక్టర్ పోరిక శ్యామల్ నాయక్ అనేక సంఘాల సన్మానాలు

జూనియర్ ఘంటసాలగా రాగమయి క్రియేషన్స్ వారిచే జూనియర్ ఘంటసాల అవార్డు

2015లో రవీంద్ర భారతి హైదరాబాదులో పారిజాత అపహరణం పౌరాణిక డ్రామాకు కళాబంధు అవార్డు

రోజా క్రియేషన్స్ వరంగల్ వారిచే నటగాయక చక్రవర్తి అవార్డు

2017లో ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడలో ఎన్టీఆర్ అవార్డు

వంద రోజులు ఓటు చైతన్య యాత్ర జిల్లా వ్యాప్తంగా చేసినందుకు ఆసియా ఇంటర్నేషనల్ అవార్డు

పాటే ప్రాణంగా జీవిస్తున్నందుకు అనేక వార్తాపత్రికలు కళామతల్లిగా కొనిఆడాయి

30 సంవత్సరాలు ఐటిడిఏ ప్రాంతంలో హాస్టల్ వార్డెన్ ఉపాధ్యాయులుగా సేవలు

70 సంవత్సరాల్లో తెలంగాణ విద్యార్థి సమాజ భవిత స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచి సమాజ సేవ

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కేంద్రంలో 02/08/23 నాడు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ అతిథి గృహంలో గారికి ఘనంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ చిన్న మంద రాజు మాదిగ నెమలి నరసయ్య ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏక సంఘ మాదిగ ములుగు జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ పుల్లూరి కరుణాకర్ ఎస్టీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ బొమ్మకంటి వినోద మాదిగ కనకం దేవదాసు మాదిగ మాంటి రవీందర్ మాదిగ చుంచు లక్ష్మయ్య డప్పు కళాకారుల సంఘం నాయకుడు 200 మంది సమక్షంలో శ్యామ్ గారికి సన్మానం చేశారు 05/08/23 నాడు ములుగు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు గోల్కొండ బిక్షపతి గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామల్ నాయక్ గారికి ములుగు విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాయకుడు శంకర్ గాయకుడు విజయ్ గాయకుడు రహీముద్దీన్ తదితర కళాకారులు పాల్గొన్నారు 06/08/23 నాడు విశ్రాంత ఉద్యోగుల భవనం ములుగులో గురు బోధ సంఘం వాళ్ళు శ్యామ్ గారిని సత్కరించారు బోధానంద వనమాలమ్మ మరియు ప్రేమ్ నగర్ రవీందర్ తదితర గురుబోధ భక్తులందరూ కలిసి శ్యామ్ గారిని సాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో బొమ్మ కంటి అర్జున్ గాయకులు కురిచిరంజీవి ఆర్కెస్ట్రా ఇన్చార్జ్ ఇనుముల రంజిత్ శ్రీధర్ సాంబయ్య అరుణ్ తదితరులు పాల్గొన్నారు 07/08/23 నాడు రిటైర్డ్ సంఘ జిల్లా అధ్యక్షులు పాల్తియా సారయ్య మాజీ అధ్యక్షులు బాసాని రామ్మూర్తి జిల్లా నాయకులు అందరూ కలిసి ఘనంగా శ్యామ్ గారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో పోరిక నందా అజ్మీరా బావ్ సింగ్ ఏ మలహలరావు మరియు ఇతర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
08/08/23 నాడు విశ్రాంత ఉద్యోగుల భవనం ములుగులో తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయర్ అసోసియేషన్ జిల్లా శాఖ వాళ్ళు ములుగు బ్రాంచ్ లో గుగులోతు రమేష్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లోపల పోయిన ఆగయ్య పూస రాజేశ్వరరావు సెక్రటరీ తదితరులు 100 మంది ఫోర్త్ క్లాస్ ఎంప్లాయర్స్ అందరూ కలిసి గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత పూరిగా శ్యామల గారిని ఘనంగా సారువలతో భోకే అందించి సన్మానించారు వైస్ ప్రెసిడెంట్ ఐలమ్మ ఎస్ డి సాయిరాజ్ ఆర్ జైపాల్ వి రాజేందర్ ఎండి ఆఫీసర్ ఎన్ రాజేష్ బి అభిలాష్ అందరూ కలిసి శ్యామల నాయక్ శ్యామల నాయక్ గారికి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ శ్యామల నాయక్ గొప్ప సేవా భావం కలిగిన నాయకుడు మా ములుగు జిల్లాకే వన్నెతెచ్చిన ప్రజా గాయకుడు ఘంటసాలను మరిపించే మహోన్నత గాయకుడు అని కొనియాడుతూ శివరాత్రి శివరాత్రి నాడు శివుడుగా శ్రీరామనవమి నాడు రాముడుగా దీపావళి నాడు శ్రీకృష్ణుడుగా అనేక పాత్రలు ధరించి మరో ఎన్టీఆర్ లా వెలిగినందుకు వేలపాటలు పాడి గంటసాలనం మరిపించినందుకు 72 సంవత్సరాల్లో కూడా ఈ సేవా భావం చేసినందుకు వారు రాజకీయాల్లో వచ్చి లోకానికి సేవ చేయాలని కోరారు ఇందుకుగాను కోరిక శ్యామల నాయక్ మాట్లాడుతూ ఈ అవార్డుతో నా జీవితం ధన్యమైందని ఏ పూర్వజన్మ పుణ్యమో ములుగు జిల్లా వాసులకు నేను కళాశివ ధర చేయగలిగాను రాజకీయ నాయకుడిగా జనం కోరితే వచ్చి రాజకీయంలో నిజమైన నాయకత్వాన్ని చూపించాలని నా మనసులో ఉన్నదని ఈ రోజులలో డబ్బు ఏలుతూ ఉన్నది ప్రజాస్వామ్యం లేదు అని లోకమంటున్నది లేదు ప్రజాస్వామ్యం బ్రతికే ఉన్నది మంచివాళ్లు లోకంలో ఉన్నారు మంచి వ్యక్తికి మంచే జరుగుతుంది పాట ద్వారా నేను ఎంతో అభివృద్ధి అయినాను ఈపాటికి నా ఆరోగ్యం కూడా మీ అందరి దయవల్ల సహకరిస్తూ ఉంది నా తను ఉన్నంతవరకు జన సేవ చేసే భాగ్యం నాకు రావాలని ఆ దేవుని కొలుస్తున్నాను మీరే నా దేవతలుగా భావిస్తాను అందరికి నమస్తే అని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!