రామయంపేట (మెదక్)నేటి ధాత్రి.
రామాయంపేట పట్టణంలో మెదక్ రోడ్ ప్రక్కన పాత ఫారెస్ట్ ఆఫీస్ భవనం స్థలం బీసీ భవనం కోసం ఎమ్మెల్యే కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ కాఫీ మంజూరు చేస్తూ ఈరోజు మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా బీసీ భవనం కోసం ఖాళీ స్థలం ప్రోసిడింగ్ కాపీని అందజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం. ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మానెగల రామకృష్ణయ్య. మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదర్ చారి. మాసాయిపేట మల్లేశం. రేవల్లి వినయ్ సాగర్. రెడ్డమైన నరేష్. మరియు బీసీ సంఘం యువజన విభాగం అధ్యక్షులు చంద్రశేఖర్ తో పాటు ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు.