రామడుగు, నేటిధాత్రి:
అర్హులైన ప్రతి ఒక్క చేనేత కుటుంబానికి చేనేత బీమా పథకం వర్తింపజేయాలని జిల్లా పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక కమలాకర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేంకట్రావుపల్లి గ్రామానికి చెందిన చేనేత యువ కార్మికుడు అడిగొప్పుల స్వామిని సన్మానించడం జరిగింది. ఈసందర్భంగా కొలిపాక కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం చేనేత భీమా ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ, దళిత బందు లాగానే చేనేత బందు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మర మొగ్గలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి చేనేతను ప్రోత్సహించాలని, రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న పద్మశాలీలను ఆర్థికంగా రాజకీయంగా ఆదుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు, టిఆర్ఎస్ యూత్ రామడుగు మండల ఉపాధ్యక్షులు బుదారపు కార్తీక్, పద్మశాలి సంఘం అధ్యక్షులు అడిగొప్పుల నర్సయ్య, ఉపాధ్యక్షులు అడిగొప్పుల శంకరయ్య, నాయకులు కొలిపాక ప్రవీణ్, అడిగొప్పుల తిరుపతి, అలిశెట్టి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.