నేటిధాత్రి, హైదరాబాద్ బ్రేకింగ్ న్యూస్..
హైదరాబాద్ నెట్ వర్క్, నేటిధాత్రి :
ప్రజా నౌక తెలంగాణ ఉద్యమ నేత ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు.
ప్రజల గుండె ఆయన గుండెగా భావించిన ప్రజా కవి గద్దర్ గుండె ఆగడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర ఇతర రాష్ట్రాల ప్రజలు కన్నీటి పర్యమయ్యారు. 1949లో పుట్టిన గద్దర్ 2010 వరకు నక్సలైట్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున రేగే సమయంలో 2010 సంవత్సరం నుండి పాల్గొన్న గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అనే పాటతో కాలుకు గజ్జకట్టి తెలంగాణ ఉద్యమాన్ని తన పాటతో తెలంగాణ ప్రాంత ప్రజలను చైతన్యవంతులను చేశాడు.
గద్దర్ అనారోగ్యంతో గురై హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్ హరీష్ రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.