రక్తదానం చేసిన యువకులను సన్మానిస్తున్న లాయక్ పాషా

హరితహారం లో మొక్కలు నాటుతున్న జర్నలిస్టు సోదరులు

రక్తదానం చేస్తున్న యువకులు

ఆస్పత్రిలో పేషెంట్స్ కి పండ్లు ఫలాలు అందజేస్తున్న వైద్యులు మహేష్ రావు, జర్నలిస్టులు..

హరితహారం లో మొక్కలు నాటండి – పర్యావరణాన్ని పరిరక్షించండి

రక్తదానం చేయండి – ప్రాణాలను కాపాడండి

టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. మంగళవారం రోజున లాయక్ పాషా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్టులు, శ్రేయోభిలాషులు ఆనంద రెడ్డి ఆసుపత్రిలో సుమారు 20 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం వంద పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఫలాలు, బ్రెడ్ అందజేశారు . గ్రీన్ చాలెంజ్ హరితహారం లో భాగంగా మొక్కలు నాటారు. జర్నలిస్టులంతా బింగి మహేష్ ఫంక్షన్ హాల్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ సామాజిక బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని సూచించారు. రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడడం గొప్ప అవకాశం గా, సామాజిక దృక్పధంగా భావించాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడితేనే మానవ మనుగడకు సార్థకత ఉంటుందని అన్నారు. రక్తదానం చేసిన యువకులకు బ్లడ్ బ్యాంకు యాజమాన్యం ద్వారా సర్టిఫికెట్లు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

50 సార్లు రక్తదానం చేసిన యువకునికి అభినందనలు

వేములవాడ పట్టణానికి చెందిన మహమ్మద్ నయీముద్దీన్ అనే యువకుడు 50 సార్లు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పటివరకు 49 సార్లు రక్తదానం చేసి లాయక్ పాషా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 50వ సారి రక్తదానం చేసి అందరి అభినందనలు అందుకుంటున్నాడు. 50 సార్లు రక్తదానం చేసి ఎంతో మంది యువకులకు మహమ్మద్ నయీముద్దీన్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. శభాష్ మహమ్మద్ నయిమొద్దీన్…కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు తాహర్ పాషా, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొలిపాక నరసయ్య, ప్రధాన కార్యదర్శి ఆయచితుల జితేందర్ రావు, ఉపాధ్యక్షులు మహమ్మద్ అజీమ్, కార్యదర్శులు కొత్వాల్ శ్రీనివాస్, మహమ్మద్ రియాజ్, గంగాధర్, కోశాధికారి కృష్ణారెడ్డి లతోపాటు కార్యవర్గం, సభ్యులు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *