‘‘బాబు’’ ఆట..’’రేవంత్‌’’ కుట్ర!?

`కూడికలో తీసివేత తంత్ర!!

`రేవంత్‌ వల్ల కాంగ్రెస్‌ కు ఒరిగిందేమీ లేదు.

`మూడు ఉప ఎన్నికల్లో ఓటమికి పరోక్షంగా రేవంతే కారణం?

`అంతకు ముందు కనీసం డిపాజిట్లైనా వచ్చేవి?

`రేవంత్‌ వచ్చాకా అవి కూడా కరువయ్యాయి.

`రేవంత్‌ అనుచరుల నినాదాలు మాత్రమే కనిపిస్తాయి.

`కాంగ్రెస్‌ పతనమే చంద్రబాబు రేవంత్‌ లా పన్నాగం?

`చంద్రబాబు ఆదేశమే రేవంత్‌ కు శిరోధార్యం?

`చంద్రబాబు ఆగర్భ కుట్ర కోణం?

`బిజేపి మేలు కోసం చంద్రబాబు మరో ప్రయత్నం?

`ఆచరణకు రేవంత్‌ ఎల్లప్పుడూ సిద్ధం?

`అప్పుడు ఓటుకు నోటు గరు దక్షిణ అసంపూర్ణం?

`కాంగ్రెస్‌ ఖతంతో పరిపూర్ణం లక్ష్యం?

`చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం రేవంత్‌ వంతుల వారి త్యాగం?

`కాంగ్రెస్‌ సీనియర్లు ఇంత కాలం మొత్తుకుంటున్నదిదే?

`అధిష్టానానికి అర్థం కాకపోయే?

`చంద్రబాబు చూపెప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతం?

`ఎప్పుడూ ఎవరో ఒకరితో పొత్తు లేకుండా సాగని చంద్రబాబు రాజకీయం?

`ఇప్పుడు మళ్ళీ బిజేపి అవసరమొచ్చింది.

`కాంగ్రెస్‌ కు పంగనామం పెట్టి ఎత్తుగడ మొదలైంది?

`కాంగ్రెస్‌ ను మోసం చేయడానికి సమయం ఆసన్నమైంది.

`అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే హస్తానికి టాటా!

`సైకిల్‌ సవారితో మళ్ళీ మొదలుపెట్టొచ్చు ఆట!

హైదరబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీకి గ్రహచారం బాగాలేనట్లుంది. ఎప్పుడు ఊపొస్తుందో..ఎవరి వల్ల పోతుందో అర్ధం కాని పరిస్ధితుల్లో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్ధితి మరింత ఆగమ్య గోచరంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 23 సీట్లు గెలిస్తే 17 మంది బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో 14 మంది గెలిస్తే 12 మంది ఆ పార్టీని వదిలేశారు. అధికార బిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్‌ లేవడం కష్టమని నిర్ణయం తీసుకున్నారు. ఇక పదవులు రాని వారు, పార్టీని వదిలి వెళ్లినా ప్రయోజనం లేనుకున్నవారు మాత్రమే కాంగ్రెస్‌లో వున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో నామరూపాలు లేకుండాపోవడంతో రేవంత్‌రెడ్డి కన్ను కాంగ్రెస్‌ మీద పడిరది. తాను ఎలాగైనా కాంగ్రెస్‌లో క్రియాశీలకం కావాలనుకున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీలోనే తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు కావాలని రేవంత్‌ రెడ్డి ఆశపడ్డాడు. అప్పుడు తెదేపాలో వున్న ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటివారు రేవంత్‌ను ముందుకు రానివ్వలేదు. తేదేపా తెలంగాణ అధ్యక్షుడి ఆశలు నెరవేరనివ్వలేదు. దాంతో ప్రస్తుతం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా వున్న ఎల్‌.రమణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యాడు. క్రమంగా తెలుగుదేశం పార్టీ మరింత కనుమరుగయ్యే పరిస్దితికి చేరుకున్నది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీల నాయకత్వం చేసిన చాలా మంది నేతలు వరుసగా బిఆర్‌ఎస్‌ గూటికిచేరుకున్నారు. ముందు ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావుతో మొదలైన వలసలు ఒక్కొక్కరుగా ఆ జిల్లా తెదేపా నేతలందరూ బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. అలా ఒక్క జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వున్న తెలుగుదేశం నాయకులు చాలా మంది బిఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. కాని రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ గుమ్మం తొక్కే పరిస్దితి లేదు. నిజాఇకి రేవంత్‌ రెడ్డి రాజకీయం మొదలైందే బిఆర్‌ఎస్‌లో…కాకపోతే తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలన్న దురుద్ధేశ్యంతో తెలంగాణకు తీరని అన్యాయం చేయడానికి ప్రయత్నించి జైలు పాలయ్యాడు. రాజకీయంగా కూడా అది సరైనది కాదు. నైతికంగా అసలు అలాంటి పనులు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు తెరతీసిన చంద్రబాబుకు సహకరించి, మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో సునామీ సృష్టించాలని చేసిన ప్రేయత్నం బెడిసికొట్టింది. అసలు విషయం ముందే తెలిసి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజకీయ చాణక్యంతో రేవంత్‌ను పట్టుకున్నారు. రేవంత్‌ దుర్మార్గం బైటపెట్టారు. ఈ కుతంత్రానికి అసలు బాధ్యుడైన చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్నంత కాలం చంద్రబాబు హైదరాబాద్‌ రావడానికి కూడా సాహసించలేదు. అలాంటి స్ధితిని చేజేతులా తెచ్చుకొని తెలంగాణలో నామరూపాలుగా లేకుండాపోయిన పార్టీ తెలుగుదేశంలో మనుగడ లేక రేవంత్‌ రాజకీయం ఆగమ్య గోచరమైంంది. పైగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఆశలు లేవు. ఆ పార్టీకి మనుగడ లేదు. దాంతో కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవడం, పదిలం చేసుకోవడం కోసం చంద్రబాబు సాయం కోరాడు. ఆయన కూడా సమ్మతించాడు. 

 2018 మధ్యంతర ఎన్నికల సమయంలో చంద్రబాబు మద్దతు కాంగ్రెస్‌ కొంప ముంచింది.

 2009 ఎన్నికల్లో అదికార బిఆర్‌ఎస్‌ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? అంటూ తెలంగాన ప్రజలను ఏమార్చే ప్రయత్నం చంద్రబాబు చేశారు. కాంగ్రెస్‌ను నిండా ముంచారు. అసలు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి కొడంగల్‌లో ఓడిపోయాడు. తర్వాత మాల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి పిసిసి. పదవిపై కన్నేశాడు. నిజానికి ఆ సమయంలో కాంగ్రెస్‌కు ఊపు తెచ్చే నాయకుడు కావాల్సివచ్చింది. 2014లో పిసిసి. అధ్యక్షుడైన పొన్నాలతో కొన్ని సీట్లు సీట్లు గెల్చుకున్నా, పార్టీని నడపడం ఆయన వల్లకాలేదు. మూడేళ్లు పార్టీని నడిపిన పొన్నాల పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చాడు. కాని ఉత్తరకుమారుడే అన్న నానుడి సార్ధకం చేసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్‌ బొక్క బోర్లా పడిరది. పైగా ఆయన బిఆర్‌ఎస్‌ పార్టీ కోవర్టు అన్న ముద్ర బలంగానే పడిరది. ఇలాంటి సమయంలో అధికార బిఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడుగా రేవంత్‌ రెడ్డి కనిపించారు. దానికి తోడు తాను పార్టీ కోసం ఎంతైనా ఖర్చు చేస్తాను. పార్టీని మోస్తాను అని రేవంత్‌ చెప్పిన మాటలు పార్టీ అధిష్టానం గుడ్డిగా విశ్వసించింది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నుంచి తనదైన రాజకీయం చేస్తున్నాడని తెలిసినా సీనియర్లు ఏం చేయలేకపోయారు. నాడు మాణిక్యం ఠాకూర్‌ అయినా, నేడు మానిక్‌ఠాకూర్‌ అయినా రేవంత్‌ ఏది చెబితే అదే నమ్ముతూ వస్తున్నారు. కాని రేవంత్‌రెడ్డి అసలు రాజకీయం అర్దం చేసుకోలేపోతున్నారు. 

   రేవంత్‌ వల్ల కాంగ్రెస్‌కు ఇసుమంతైనా లాభం జరిగిందా? 

అంటే లేదనే చాలా మంది అంటారు. ఔనని ఏ ఒక్కరూ సమాధానం చెప్పడానికి సిద్దంగా లేదు. ఎందుకంటే రేవంత్‌ వల్ల వచ్చిన ఊపు లేదు. బలం అంతకన్నా లేదు. పైగా ఆయన సారధ్యంలో వచ్చిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పోవడం గమనార్హం. రేవంత్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ సమయంలో కొత్త ఊపుతో రేవంత్‌ ఏదో పొడిచేస్తాడన్నంతగా పార్టీ గంపెడాశలు పెట్టుకున్నది. కార్యకర్తలు ఎంతో ఊపును ఊహించుకున్నారు. కాని మొదటి ఎన్నికలోనే రేవంత్‌రెడ్డి అస్త్ర సన్యాసం చేశాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 60 వేల ఓట్లు వస్తే, ఉప ఎన్నికల్లో మాత్రం మూడు వేలే వచ్చాయి. కాంగ్రెస్‌ ఓట్లన్ని ఎటు పోయాయని సీనియర్‌ నేతుల ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక వచ్చింది. నోముల నర్సింహయ్య మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడ భగత్‌ పోటీచేశారు. ప్రత్యర్ధిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇంకా చెప్పుకునే జానారెడ్డి పోటీచేశారు. కాని ఏమైంది? కాంగ్రెస్‌ ఓటమిని చూడాల్సి వచ్చింది. దీంతో రేవంత్‌ నేతృత్వం కూడా ఐరన్‌ లెగ్‌ అన్నది కన్ఫర్మ్‌ అయ్యింది. అంతే కాదు ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రేవంత్‌ రెడ్డి తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆ పార్టీ అదికారంలోకి రాలేదు. పైగా తెలంగాణ రాకతో తెలంగాణలో లేకుండానే పోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే రుచి చూస్తోంది. అసలు విషయం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ పార్టీ గ్రహిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీని రేవంత్‌ రెడ్డి ఓడిస్తూ వస్తున్నాడని పార్టీ కొంత తెలుసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నికతో రేవంత్‌ రాజకీయం మొత్తం బట్టబయలైంది. ఓ వైపు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చావో రేవో తేల్చే ఉప ఎన్నిక ప్రచారం గాలికి వదిలేసి, రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు హజరౌతూ వచ్చారు. అంటే మునుగోడును ముంచాలని ముందే నిర్ణయించుకున్నాడు. కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాకుండా చేశాడు. 

ఇదంతా రేవంత్‌ ఎందుకు చేస్తున్నాడు? అన్నది ఏ సీనియర్‌కు అర్ధం కాని ప్రశ్న. 

కాని దీన్ని అంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఉప ఎన్నికల్లో ఆయన క్రియాశీలమైతే ఆ క్రెడిట్‌ గెలిచే సీనియర్లకు వస్తుంది. నాగార్జున సాగర్‌లో గెలిస్తే జానారెడ్డి మళ్లీ క్రియాశీలకమౌతాడు. మునుగోడులో గెలిస్తే పాల్వాయి స్రవంతి పేరు మారిమోగిపోతుంది. ఇదిలా వుంటే మొత్తం కాంగ్రెస్‌లో తన వర్గమే వుండాలి. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు తన వర్గంతోపాటు, తనతో తెలుగుదేశం నుంచి వచ్చిన వారు మత్రమే కనిపించాలి. ఏది జరిగినా వాళ్లంతా తనతోనే వుండాలి. తాను కాంగ్రెస్‌లో వుంటే వారికి ప్రాదాన్యత కల్పించాలి. ఒక వేళ ఏదైనా జరగకూడదనిది జరిగితే జంప్‌ కావడానికి వాళ్లంతా సిద్దంగా వుండాలి. ఇదీ మొదటి నుంచి రేవంత్‌ నెరుపుతున్న అంతర్గత రాజకీయం. ఇదంతా చంద్రబాబు నాయుడుకు తెలుసు. అయితే అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల వచ్చింది. కాని తెలంగాణ ప్రజలు ఆమెను వ్యతిరేకించడం లేదు. పైగా బిఆర్‌ఎస్‌ జాతీయ స్ధాయి పార్టీ అయిన తర్వాత ఇతర పార్టీలన ప్రశ్నించలేదు. దాంతో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తే ఎలా వుంటుందన్న ఆలోచన మొదలైంది. పైగా కాంగ్రెస్‌లో నిత్యం కల్లోలం కన్నా తెలుగుదేశంలో చేరితే అక్కడ కూడా తన హవానే సాగుతుంది. చంద్రబాబు ఎలాగూ రేవంత్‌కు ఫ్రీ హాండ్‌ ఇస్తాడు. కాంగ్రెస్‌లో కలహాలకాపురం, నిత్యం కష్టపడడం కన్నా, ఆ పార్టీని నిండా ముంచి, తన వర్గాన్నంతా తెలుగుదేశం పార్టీకిచేర్చి అక్కడ రాజకీయం చేయడమే మేలని నిర్ణయించుకున్నాడట. అందుకే కాంగ్రెస్‌లో కరంటు మంటలు పెట్టి, పోతున్నాడట?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!