ఆ గెట్టు లక్ష..ఈ గెట్టు కోటి!

`అటు ఆంద్రా…ఇటు మహారాష్ట్ర.

` మధ్యలో తెలంగాణ… సిరుల మాగాణ.

` భూముల ధరలు ఎక్కడ విన్నా కోటి.

` తెలంగాణ వెలుగుల దివిటీ

` దేశంలోనే తెలంగాణ భూమి మేటి.

` అటు సాగులో కనీవినీ ఎరగని పురోగతి…ఇటు పారిశ్రామిక ప్రగతి.

` నిన్న బీడు నేల…నేడు బంగరు నేల.

` తెలంగాణ భూములు బొచ్చెడు పిరం…

` పొరుగు రాష్ట్రాల రైతులది దుఖం.

` నిన్న దుఖమెల్లవోసిన నేల…

`ఇప్పుడు ఎల్లకాలం నూతుల నిండా జల.

` నాడు చుక్కకేడ్చింది…నేడు పొలం మురుస్తోంది.

` పదేళ్ల కింద వలసలు…నేడు బంగారు పంటలు.

`నిన్న దేశాలు పట్టుకొని పోయి…నేడు ఊరిలో శ్రీమంతుడై..

` తెలంగాణ రైతు రాజయ్యాడు…

హైదరబాద్‌,నేటిధాత్రి:                                    

మనిషికైనా, మానుకైనా, పక్షికైనా, ప్రకృతికైనా, ఏ జీవికైనా, చెట్టుకైనా, పుట్టకైనా, భూమికైనా, పాడికైనా , పంటకైనా నీరే ఆధారం. ఆ నీరు లేక గోపడిన తెలంగాణ ఇప్పుడు నీటి గంగాళమైంది. నీటి గోస లేని తెలంగాణ ఆవిష్కృతమైంది. తెలంగాణ గోదారి నీళ్లతో కళకళలాడుతోంది. అన్నింటికీ నీరే జీవాధారం. ఒకనాడు కాకతీయ కాలమైనా, సర్కారు నిజామైనా నీటి జాడలలు తొనికసలాడిన తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో విలవిలలాడిరది. చుక్క నీటి కోసం ఎదురు చూసింది. కనికరం లేని ఉమ్మడి పాలకుల చేతిలో కన్నీటిని దిగమింగుకున్నది. తెలంగాణ సాగు నీటి వనరైన చెరువులు ద్వంసం చేయబడ్డాయి. ప్రాజెక్టులు సాధ్యం కాదని తేల్చి, చెప్పి రైతును కష్టాల పాలు చేశారు. ఆ పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ చైతన్య గీతికను ఆలపించి, ఉద్యమించి, పోరాటాన్ని ఉరకలెత్తించి, ఉక్కు సంకల్పంతో, పిడికిళ్లు బిగించి, మూడున్న కోట్లు గొంతులు సవరించి, జై తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా నినదించి, డిల్లీ గల్లీలో కూడా తెలంగాణ రణ నినాదం చేసి తెలంగాణ సాధించిన వీరుడు కేసిఆర్‌. తెలంగాణ తలరాత మార్చిన తనయుడు కేసిఆర్‌. తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌…

తెలంగాణ వచ్చింది ఏం మారింది?

ఇది తెలంగాణలోని కొంత మంది కనులుండీ చూడలేని వారి ప్రశ్న. కాని తెలంగాణ వచ్చాక తెలంగాణ పూర్తిగా మారిపోయింది. అసలు ఒకప్పటి తెలంగాణేనా అని అనిపిస్తోంది. హైదరాబాద్‌కు వెళ్లే ఎక్కడున్నామన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది తెలంగాణకు వస్తున్నవారు చెబుతున్న మాట. సీమాంధ్రకు చెందిన ఒకప్పటి పాలక నేతలు కూడా చెబుతున్న మాట. తెలంగాణ వస్తే ఇక చీకట్లే అన్న వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. తాము తెలంగాణ అభివృద్ది కాంక్షించలేకపోయామని, సహకరించలేకపోయామని సిగ్గుపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పి తమ చేతగాని తనాన్ని నిరూపించుకుమని అంటున్నారు. అసలు తెలంగాణ ప్రాంతమే తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికి రావని అన్న వాళ్లు , తెలంగాణ ఇలా నీళ్లుతో తడుస్తుందని కలలో కూడ అనుకోలేదంటున్నారు. తెలంగాణ చీకటౌతుందనుకున్నాం? కాని అన్నింటినీ అధగిమించింది. సీమాంధ్రను మంచిపోయింది. తెలంగాణ కూడా అన్న పూర్ణగా మారింది. ధాన్యరాసులు పండుతున్నాయి. భూములకు విపరీతమైన ధర వస్తోంది. దేశంలోనే ఇంత డిమాండ్‌ వున్న స్ధలాలు లేవు. దిక్షిణభారత దేశంలోని రాష్ట్రాల గురించి చెప్పుకున్నా ఒకప్పుడు చెన్నై అంటే ఎంగో గొప్పగా చెప్పుకునేవారు. కాని అక్కడ మంచినీటి కటకట. కర్నాకట రాష్ట్రంలోని బెంగుళూరును సిలికాన్‌ వ్యాలీ అంటారు. కాని అక్కడ కూడా పొల్యూషన్‌ విపరీతంగా పెరిగిపోయింది. నగరం పెరిగేందుకు స్ధలం లేకుండాపోయింది. హైదరాబాద్‌ సుందరీకరణ అంటే ఒక అద్భుతం. ఎంతో మంది చెబుతున్నారు. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ప్రగతి మాయాజాలం. అభివృద్ధి మంత్రం. తెచ్చిన తెలంగాణను బంగారు తునక చేయాలన్న లక్ష్యం. అందుకే తెలంగాణ ఒక అపురూపంగా మారింది. తెలంగాణ అద్భుత కట్టడాలతో అలరాలుతోంది. ప్రతి జిల్లా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబడుతోంది. అభివృద్ధి అన్ని జిల్లాలకు సమానంగా పంచబడుతోంది. అన్ని జిల్లాలు సర్వతోముఖాభి వృద్ధి సాధిస్తున్నాయి. హైదరాబాద్‌ సౌకర్యాలు తెలంగాణలోని దాదాపు అన్ని నరగాల్లోనూ అందుతున్నాయి. అందుకే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది. తెలంగాణ భూముల విలువ అమాంతం పెరిగింది. 

 తెలంగాణలో భూముల ధరలు దేశంలో ఎక్కడా లేనంతగా పెరిగాయి.

 ప్రజల స్ధిర చరాస్ధులు గణనీయంగా పెరిగిపోయాయి. అందుకు కారణం తెలంగాణ పరిపాలనలో అదొక అద్భుత ఆవిష్కారం. ఒకప్పుడు సీమాంధ్రలో ఒక ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో నాలుగు ఎకరాల స్ధలం కొనుక్కొవచ్చు అన్న మాటలే వినపడేది. కాని ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసరాల్లో ఒక ఎకరం భూమి అమ్ముకుంటే, సీమాంద్రలో కనీసం వంద ఎకరాలు కొనుగోలు చేసుకోవచ్చు. అని సాక్ష్యాత్తు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అంటే తెలంగాణ ఎంతలా అభివృద్ది చెందిందో అర్దం చేసుకోవచ్చు. తెలంగాణలోని ఏ ప్రాంతంలో భూముల రేట్లు చూసిన అంతే గొప్పగా వున్నాయి. ఒకప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతం అంటూ వుండేవారు. కాని నేడు అదే ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా ఎకరం భూమి కోటి రూపాయలు దాటి పలుకుతోందంటే ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తున్నట్లు కాదు. అదే ఆ పక్కన వున్న మహారాష్ట్రలో ఎకరం కనీసం లక్ష రూపాయలు కూడా పలకడం లేదు. ఇటు వెళ్తే కర్నాకట బోర్డర్‌లో కూడా పెద్దగా భూములకు విలువ లేదు. కొద్దో గొప్పొ ఆంధ్ర ప్రాంతానికి చెందిన భూములకు విలువున్నా, తెలంగాణ భూములతో పోల్చితే ఎక్కడో అట్టుడుగునే వున్నాయి. తెలంగాణ రాక ముందు సరిగ్గా పదేళ్ల క్రితం హైదరాబాద్‌ తప్ప, తెలంగాణలోని ఏ ప్రాంతంలోనైనా ఎకరం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల లోపే వుండేది. కాని నేడు ఏ మారు మూల ప్రాంతమైనా సరే కనీసం రూ.50లక్షలకు తక్కువ లేదు. ఏ జిల్లా కేంద్ర చుట్టు పక్కల ప్రాంతాలైనా సరే కోటి రూపాయలకు తక్కువ లేదు. ఇదీ తెలంగాణ భూముల విలువ. 

అటు ఆంధ్రా, ఇటు మహారాష్ట్ర, ఆ పక్కనున్న కర్నాకట రాష్ట్రాల ప్రజలు తెలంగాణను చూసి అబ్బుపడుతున్నారు.

మురిసిపోతున్నారు. ఒకప్పుడు మన తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లేవారు. తెలంగాణ పల్లెలను వదిలి ప్రజలు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అంటూ వసలు వెళ్లేవారు. పాలమూరు గోస గురించి, వలస గురించి ప్రత్యేకంగాచెప్పాల్సి వస్తే రాస్తే రామాయణమంత , వింటే భారతమంతా! వుంటుంది. అదీ పదేళ్ల క్రితం తెలంగాణ బతుకు. కాని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని, ఓర్వలేని తనంతో ప్రతిపక్షాలు సాగిస్తున్న అసత్య ప్రచారం ప్రజలు నమ్మరు. అయినా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. నిజానికి తెలంగాణ ఇంతలా అభివృద్ది జరుగుతుందిన కాంగ్రెస్‌, బిజేపి పార్టీలు కలగనలేదు. కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఏం చేస్తారో…చూద్దాం అన్నట్లు సీమాంధ్ర నాయకులు ఎదురుచూశారు. తెలంగాణ అభివృద్ది అంటే నీళ్లు తేవడం అంత సులభం కాదని కాంగ్రెస్‌ అనుకుంటూ వచ్చింది. కాని తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో కరంటు వెలుగులు కనిపించే సరికి కాంగ్రెస్‌, బిజేపిల కళ్లు బైర్లు కమ్మాయి. నిరంతర విద్యుత్‌ తెలంగాణలో సరఫరా అవుతుంటే ఇదెలా సాధ్యమౌతుందంటూ ఆశ్చర్యపోయాయి. మనసుంటే మార్గం వుంటుంది. అభివృద్ది చేయాలన్న చిత్తశుద్ది పాలకుల్లో వుంటే ఏదైనా సాధ్యమౌతుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. ఊరు వదిలి వలస వెళ్లిన రైతు తిరిగి పల్లెకు వచ్చాడు. కన్న తల్లి లాంటి ఊరును వదలి, ఆస్ధిగా భావించే సాగు భూమిని వదిలి పొట పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఇప్పుడు ఆ రైతే పల్లెకు మళ్లీ చేరుకున్నాడు. కళ్ల నిండా నీళ్లు చూస్తూ, కడుపారా పొలానికి నీరందిస్తున్నాడు. బంగారు పంటలు పండిస్తున్నాడు. తెలంగాణ రైతు రాజయ్యాడు. ఇదందా సాధ్యం కావడానికి కారణం ఒక్క పేరు..అదే కేసిఆర్‌. ఆయనే తెలంగాణ తల రాత మార్చిన యుగకర్త. తన ప్రాంతం మీద మమకారంతో ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి, తెలంగాణ సాధించిన కేసిఆర్‌ ఖచ్చితంగా దైవాంశ సంభూతుడే…ఆయన పేరు తెలంగాణ చరిత్రలో తరతరాలు చెరిగిపోని నిఘంటువే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!