కాంగ్రెస్‌ కు మిగిలేవి కలలే?

` బిజేపికి ఆశలు లేవులే !?

` కాంగ్రెస్‌ ను నమ్మితే నట్టెట మునుగుడే?

` బిజేపిపై జాలి చూపితే బతుకు బజార్ల పడుడే?

`ఖమ్మం సభతో కాంగ్రెస్‌ కథ కంచికే అంటున్న ‘‘మునుగోడు’’ సీనియర్‌ ‘‘బిఆర్‌ఎస్‌’’ నాయకుడు ‘‘నారబోయిన రవి ముదిరాజ్‌’’ ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో మాట్లాడుతూ నమ్మితే గతం దరిద్రమంతా ముందుకు తెస్తారని నాటి అనుభవాలు ఆయన మాటల్లోనే..

` ఒక్కసారి కనికరిస్తే మళ్ళీ పాత కథలే?

` కరంటు కోతలే!

`అర్థరాత్రి కరంటు కష్టాలే?

`మోటార్లు కాలుడే?

`ట్రాన్స్‌ ఫార్మర్లు కరాబే!

` ఎరువులకు రోడ్డెక్కుడే?

`పంటలు ఎండుడే?

` నీటి గోసలే!

` రైతుకు కన్నీళ్లే!

` చెరువులు ఎండుడే?

`కాలువలు పూడుడే!

` కేవిపి పెత్తనం వచ్చుడే!

` తెలంగాణను ఆగం చేసుడే!

`తెలంగాణ కు మళ్లీ అన్యాయం జరుగుడే?

హైదరబాద్‌,నేటిధాత్రి:   

https://netidhatri.com/తవ్వుకుంటే-కబ్జాలు-బె                                 

 

చెల్లని కాసుకు గీతలెక్కువే..కాంగ్రెస్‌కు చెప్పుకునే గొప్పలు ఉట్టివే..!అయినా ఒక్క సభకే ఎగిరెగిరి పడితే…ఉద్యమ కాలం నుంచి మొదలు బిఆర్‌ఎస్‌ సభలేమిటో తెలిసి, కూడా ప్లూటు సింహం లాంటి బిఆర్‌ఎసూ ముందు కాంగ్రెస్‌ జింక ప్లూటు ఊదినట్లుంది. ఒక్కరోజులో వచ్చేది బలుపు కాదు..వాపు..అది రోగంతో సమానం. నిన్నటిదాకా రెండో స్ధానమే దక్కుతుందో లేదో అంటూ మధనపడిరది. మనుగడ కోసం ఆరాటపడిరది. కర్నాటక ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే ఇక్కడ జబ్బలు చర్చుకుంటోంది. ముందే మురవడం మొదలు పెట్టింది. కనీసం అలాగైనా కాంగ్రెస్‌ సంబరపడడం చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అన్నది ఏనాడో మరుగున పడిపోయింది. తెలంగాణకు అరవైఏండ్లు చేసిన నష్టం, పెట్టిన గోస చాలు అని ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పుడో బంగాళా ఖాతంలో కలిపేశారు. ఇంక దానికి మనుగడ అన్నది తెలంగాణలో లేదు. ఒక్క నాయకుడు చేరినందుకే కాంగ్రెస్‌లో జోష్‌ నిండితే ఇప్పుడు వున్న నాయకులంతా దద్దమ్మలమని ఒప్పుకున్నట్లేనా? బిఆర్‌ఎస్‌లో పనికి రాని నాయకుడు కాంగ్రెస్‌లో కళ్లకద్దుకోవడం అంటే ఆ పార్టీ ఎంత దీనావస్ధలో వుందో అర్దం చేసుకోవచ్చు. ఏది ఏమైనా బిఆర్‌ఎస్‌లో పని చేయలేని నేతలు, బిఆర్‌ఎస్‌ నుంచి పంపించిన నేతలతో నింపుకున్న పార్టీలు మాతో పోటీ పడడడం అరువు నేతలే దిక్కుగా బతకడమే! అంతటి దురవస్ధను ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ మేమే వస్తాం..అని చెప్పుకోవడం విడ్డూరం. అయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయ్యాలో ఒక్క మాట చెప్పగలిగే స్దితి, స్దాయి వారికి లేదు. అందుకే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్‌కు మిగిలేవి కలలే…అంటున్న మునుగోడు బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్‌ కాంగ్రెస్‌ను తూర్పారపడుతూ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు.. పాఠకుల కోసం! ఆయన మాటల్లోనే…

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన గోసలు అన్నీ ఇన్నీ కావు.

 తెలంగాణను నీటి చుక్క ఇవ్వమంటే నలభైఐదేండ్లు గోస పెట్టింది. ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు. సాగు ముందుట పడనీయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన వికాసాన్ని చూసి కాంగ్రెస్‌ నాయకులు సిగ్గు పడాలి. కేవలం రాజకీయ స్వార్ధం కోసం తప్ప, తెలంగాణకోసం ఏనాడు ఆలోచించనందుకు కాంగ్రెస్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఉమ్మడిరాష్ట్రంలో చెరువులు బాగు చేస్తే తెలంగాణ ఉద్యమం వుండేదా? ప్రాజెక్టులు కట్టాలన్న సోయి వుండేదా? తెలంగాణపై కక్ష్యపెంచుకున్నట్లు ఉమ్మడి పాలకులు ప్రవర్తిస్తుంటే ఎవరైనా ప్రశ్నించారా? మా తెలంగాణ నిధులు మాకు ఖర్చు చేయాలే అని నిలదీశారా? తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు కట్టరని ఎదురుతిరిగారా? ఆంధ్రలో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కడుతుంటే కళ్లప్పగించి చూశారు. తెలంగాణకు నీళ్లియమని మొహం మీద చెబితే పదవుల కోసం ఆశపడ్డరు. ఆఖరకు పోతిరెడ్డి పాడుకు నుంచి కూడా నీళ్లు తీసుకుపోతుంటే అడగలేదు. సీలేరు నుంచి కరంటు ఎందుకియ్యరు? అనలేదు. తెలంగాణ చీకట్లు చూసింది. విలవిలలాడిపోయింది. అలాంటి కాంగ్రెస్‌ నేతలా రేపు తెలంగాణకు ఉపయోపడేది. వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ పదేళ్లలో చేసి చూపించాడు. తెలంగాణను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. అన్ని రంగాలు సర్వతోముఖాభివృద్ది చేశారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని ప్రయోజనాలు తెలంగాణ ప్రజలు అందుకుంటున్నారు. తెలంగాణ సాగులో విప్లవం తెచ్చాడు. నీటి చుక్క కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నేలతల్లి దాహం తీర్చిన కొడుకు కేసిఆర్‌. సాగుకు తెలంగాణలోని ప్రతి మూలను సిద్దం చేసిన నాయకుడు కేసిఆర్‌. ప్రతి ఎకరాకు నీళ్లుందిస్తున్న పాలకుడు కేసిఆర్‌. ప్రతి చోట పచ్చదనం వెల్లివిరిసేలా చేసిన పాలనాదక్షుడు కేసిఆర్‌. దేశంలోనే కేసిఆర్‌ లాంటి నాయకుడు లేడు. పాలకుడు లేడు. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కలలు కనడం అంటే పగటి కలలే…అర్ధరాత్రి కలత నిద్రలే..

 ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిన మాట ఇప్పటికీ తెలంగాణ సమాజానికి గుర్తే వుంది. 

కాని కాంగ్రెస్‌ నేతలకే ఆనాడు వినిపించలేదు. ఇప్పుడు గుర్తుకు లేదు. నవ్వేవారి ముందు జారిపడ్డట్టు తెలంగాణ సమాజం ఇక ఎప్పుడూ వెనకడుగు వేయొద్దని చెప్పేవారు. అది ఉద్యమమైనా, ఉద్యమ స్పూర్తితోసాగే పాలనైనా అని తెలంగాణ ప్రజలు ఆనాడు, నేడు ఆచరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన మాత్రమే కావాలనికోరుకుంటున్నారు. మెరిసే బంగారమంత గొప్పగా తీర్చిదిద్దబడిన తెలంగాణను ఆదమర్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ఆశలు నెరవేర్చాలనే జాలి పడితే మళ్లీ తెలంగాణ వందేళ్లు వెనక్కిపోతుంది. ఖమ్మం సభలో కాంగ్రెస్‌నాయకుల తీరు అందరూ చూశారు. ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ఒకరినొకరు ఎలా తోసుకున్నారో…చూశాం. రేపు పాలన కూడా అంతే…పదవులు కోసం కాంగ్రెస్‌ నాయకులు పడే తపనతో పాలన గాలికొదిలేస్తారు…తెలంగాణను ఆగం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ముందుకు ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చుతూ, ప్రజల సంక్షేమం పట్టించుకోలేదు. పైగా ఏ పాలకుడు వచ్చినా సీమాంధ్ర ప్రగతిని కోరుకుంటే తెలంగాణ నాయకులు నోరు మెదపలేదు. తెలంగాణ వచ్చినా ఇంకా సీమాంధ్ర నేతలు కబంద హస్తాల చేతుల్లోనే వుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా ఉమ్మడి రాజధాని పేరుతో కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాల సమయంలో వస్తూ వెళ్తూ వుంటారు. ఒక్కసారి ప్రజలు కాంగ్రెస్‌ మీద జాలి పడితే, పీల్చుకుతింటారు. తెలంగాణను పిప్పి చేస్తారు..కేవిపి లాంటి వారి చేతిలో తెలంగాణ భవిష్యతును పెడతారు? ఇది సామాన్యులకు తెలియని విషయం. 

 అందుకే ఆనాటి గోసలు ఇక ఎప్పుడూ వద్దు. తెలంగాణలో కాంగ్రెస్‌ వద్దే వద్దు. 

 తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచేందుకు సాగుకు నీళ్లివ్వాలంటే ఎన్నో సాకులు చెప్పి, తప్పించుకున్న ఆనాటి పాలకులైన కాంగ్రెస్‌ నేతలుకు కాళేశ్వరం నీళ్లు కనిపించడం లేదా? కాళేశ్వరాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్‌నేతలు ఆనాడే ఎందుకు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? తెలంగాణ కోసం ఎందుకు ఆలోచించలేదు. ఆనాడే ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే తెలంగాణ ఎందుకు దు:ఖపడేది. అసలు కాంగ్రెస్‌కు మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణ సమాజం ముందు నిలబడే హక్కు అసలే లేదు. 2001లో తెలంగాణ డిక్లరేషన్‌ అంటూ ప్రకటించి, 2004 ఎన్నికల్లో ఆనాడు బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని పదేళ్లు కాలయాపనచేసి, తెలంగాణను హరిగోస పెట్టింది కాంగ్రెస్‌పార్టీ. ఆఖరకు తెలంగాణ ప్రకటన చేసి, వెనక్కి తీసుకొని తెలంగాణను అగ్ని గుండం చేసింది కాంగ్రెస్‌. ఇక తెలంగాణ ఇవ్వని పరిస్ధితి తెచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమాన్ని చూసి, తప్పని పరిస్ధితుల్లో తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ సాధనలో తెలంగాణ కాంగ్రెస్‌నేతలు కృషి ఇసుమంతైనా లేదు. ఇక బిజేపి నాయకులు వంతు అసలే లేదు. కేసిఆర్‌ పండిరచిన పంట కుప్ప మీద పెత్తనం మాకు అన్నట్లు తెచ్చిన తెలంగాణలో పాలన కోసం రెండు పార్టీలు పగటి కలులు కంటున్నాయి. రెండు మూడు స్ధానాల కోసమే కొట్లాడుకుంటున్నాయి. ఆ స్దానాలు దాటి రాలేవు. బిఆర్‌ఎస్‌ ముందు ఆ రెండు పార్టీల కుప్పిగంతులు చెల్లవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!