బిజేపి పగటి కలలు?

`రాష్ట్ర బిజేపి నేతలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ పోచంపల్లి.

`జనతా సంక్షేమం లేని పార్టీ?

`పేదలను వంచించిన పార్టీ?

`సామాన్యుల ఉసురుపోసుకుంటున్న పార్టీ?

`కర్ణాటక లో కనుమరుగు కావడం ఖాయం?

`ఎనమిదేళ్లలో కూల్చుడు, అమ్ముడు తప్ప చేసిందేమీ లేదు? 

`దేశం మొత్తం మీద ఒక్క ప్రాజెక్టు కట్టలేదు?

`ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని నమ్మించి ఇచ్చింది లేదు?

`జనం బిజేపిని నమ్మానికి సిద్ధంగా లేరు?

`బిజేపికి ఎక్కడా ఆదరణ లేదు?

`రెండు సార్లు అవకాశం ఇస్తే అంతా ఊడ్చేశారు?

`మళ్ళీ నమ్మితే ఇంకేం మిగల్చరు?

`ప్రభుత్వం అంటేనే సంక్షేమం?

`పేదల అభ్యున్నతే దేశానికి అవసరం?

`పేదలకు పన్నులు, వ్యాపారులకు సంపదలు?

`ఇదా బిజేపి నీతి? రీతిలేని రాజకీయ దుర్నీతి?

` ప్రజల మధ్య అగాధం బిజేపికి శాపం?

`కరీంనగర్‌ కు పైసా పని చేయని బండి, కారుకూతలు ఆపు?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలయ్యాయని సామెత. దేశంలో బిజేపి పరిస్దితి చూస్తే అలాగే వుంది. రాష్ట్రంలో మరింత అద్వాహ్నంగా వుంది. రాష్ట్రంలో అసలు ఏ లెక్కన పగటి కలలు గంటున్నారో అర్ధం కావడంలేదు. దేశంలో గత ప్రభుత్వాన్ని కాదని ప్రజలు బిజేపికి అధికారం కట్టబెడితే పెనంలోనుంచి పొయ్యిల పడ్డట్టు చేస్తున్న బిజేపికి మరోసారి అధికారం కోరే అర్హత ఎప్పుడో కోల్పోయింది. నమ్మి ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం కట్టబడితే దేశ ప్రజలను నానాగోసలు పెట్టిన ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ లేదు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వమంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూసింది లేదు. పైగా తెలంగాణ అంటేనే గిట్టని ప్రధాని నేతృత్వంలో తీరని నష్టం జరుగుతోంది. వివక్షకు గురౌతోంది. తెలంగాణను అన్ని రంగాలలో వెనకబాటును గురిచేసేందుకు చేయాల్సినంత కుట్ర బిజేపి చేస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ మీద విషం చిమ్మే మోదీని నమ్మి ఓట్లేస్తారా? తెలంగాణలో బిజేపిని ప్రజలు నమ్మడం అనేది కలలో కూడా జరగదు. అయినా తెలంగాణ సాధకుడు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్ధానంలో కొనసాగుతోంది. అసలు కేసిఆర్‌ తెలంగాణ సాధించకపోతే తెలంగాణ పరిస్ధితి ఎలా వుండేదో తెలిసి కూడా అబద్దాలలో బతికే బిజేపికి తెలంగాణలో స్ధానం లేదు. ఆపార్టీకి కనీసం ఆదరణ లేదు. ఏం చూసుకొని బిజేపి పగటి కలలు కంటోందో అర్ధంకాని ప్రశ్న. అయినా దేశంలో అధికారం ఆ పార్టీకి కట్టబెడితే ఇప్పటికే యాభై ఏండ్ల వెనక్కుపోయింది. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్య వంతులు. అందుకే గత ఎన్నికల్లో ఒక్క సీటుకు పరిమితం చేశారు. అయినా ఆ పార్టీకి ఇంకా జ్ఞానోదయం కావడం లేదు. ఆసారి దేశం మొత్తం ప్రజలు బిజేపికి కర్రుకాల్చి వాత పెట్టే రోజులు ఎంతో దగ్గర్లోనే వున్నాయంటూ ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో మాట్లాడుతూ పోచంపల్లి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఆయన మటల్లోనే.

దేశంలో బిజేపి తుడిచిపెట్టుకుపోయవడం ఖాయం. కర్నాకట ఎన్నికలతో బిజేపికి పతనం మొదలు కానుంది. 

కర్నాటక లో బిజేపి నేతలు, ఆ పార్టీ కార్యకర్తలే కర్రు కాల్చేందుకు సిద్దంగా వున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రజలను ఒత్తిడికి, ఇబ్బందులకు గురి చేసిన వాళ్లెవరు చరిత్రలో నిలవలేవు. ప్రజల సంక్షేమం పట్టని ఏ పార్టీ మనుగడలో లేదు. బిజేపి అంతో ఇంతో గతంలో ప్రజలు కాని ఇక భవిష్యత్తులో దేశ ప్రజలు నమ్మే పరిస్దితే లేదు. జనసంఫ్‌ు నుంచి జనతా వచ్చింది. అది పీసులు పీసులై, బిజేపి వచ్చింది. ఇక ఆ బిజేపి కూడా మోడీ మూలంగా కనుమరుగైపోయినట్లే అని చెప్పక తప్పదు. ఇక దేశ రాజకీయాలలో బిఆర్‌ఎస్‌ కీలకంగా మారే తరుణం ఆసన్నమైంది. అటు బిజేపి పతనం, ఇటు బిఆర్‌ఎస్‌ విజృంభనం ఏక కాలంలో సాగి, దేశానికి కొత్త శక్తి రానున్నది. పొరుగును వున్న మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ అభివృద్దిని చూసి, తమ ప్రాంతం కూడా అలా అభివృద్ది చెందాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ దేశ వ్యాప్తంగా బలపడుతున్న తరుణం ఒక వైపు సాగుతుంటే, దేశంలో కనుమరుగయ్యేందుకు సిద్దంగా వున్న బిజేపి పార్టీ తెలంగాణలో దింపుడు కల్లెం ఆశతో పగటి కలలు కంటున్నారు. అసలు ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకొని వెళ్లాలన్న కనీసం సోయి కూడా లేకుండా సిగ్గూ, ఎగ్గూ లేని మాటలు మాట్లాడుతున్నారు. తెల్లారి లేవగానే నోర్లు కడుకుంటున్నారో…లేక అదే పాచి నోటితో మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సరిపోదు. నిజం మాట్లాడాలే..నీతిగా మాట్లాడాలే! తెలంగాణ ప్రగతిని ప్రజల కళ్లతో చూడలేని బిజేపి నేతలు అభివృద్దిని చూసి ఓర్వలేకపోతున్నారు. బిజేపి నేతలకు నిజంగా తెలంగాణ మీద చిత్త శుద్ది వుంటే తెలంగాణ ప్రగతిలో వారి బాగస్వామ్యమేమిటో చెప్పాలి. చెప్పుకోవడానికి కనీసం ఒక్క పని కూడా లేదు. అందుకే రాష్ట్ర ప్రగతిని, తెలంగాణలో కనిపిస్తున్న అభివృద్దిని తమ అభివృద్దిగా ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసుకుంటున్న బిజేపిని తెలంగాణ ప్రజలు ఎప్పుడో దూరం పెట్టేశారు. ఇంకా ఆ విషయం వారికి అర్ధం కావడం లేదు. 

దేశంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారన్న కనీసం అవగాహన బిజేపి నేతలకు లేకపోవడం దురదృష్టకరం. 

పేరులో వున్న జనతా అంటే ఆ పార్టీ నాయకుల దృష్టిలో పేదలు కాదన్నది తేలిపోయింది. జనతా వారి దృష్టిలో గుజరాత్‌ వ్యాపారులు తప్ప, మరొకరు కాదు. అందుకే దేశ ప్రజల చెమట, రక్తంతో కట్టే పన్నులను పోగేసి, వ్యాపారులకు కట్టబెడుతూ, సామాన్యులను గోస పుచ్చుకుంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వున్న ధరలకు ఇప్పటి ధరలకు వున్న తేడా ప్రజలందరికీ తెలుసు. మొదటిసారి ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత నోట్ల రద్దుతో దేశ ఆర్ధిక వ్యవస్ధను అతలాకుతలం చేసి, ప్రజలను మరింత పేదలను చేసిన బిజేపికి ఆర్ధిక ప్రగతి మీద, అర్ధ శాస్త్రం మీద కనీసం అవగాహన లేదు. ఉల్లి పాయల రేటు తగ్గించమంటే వాడకం మానేయమనే పాలకులు ప్రపంచంలో ఎక్కడా వుండరేమో! రేషన్‌ దుకాణాల దగ్గర ప్రదాని ఫోటో లేదని పేచీ పెట్టుకునే కేంద్ర మంత్రి వ్యవహారం ప్రపంచంలో ఎక్కడా వినీ చూసి వుండకపోవచ్చు. ఎంత సేపు మతం రాజకీయం, పొరుగు దేశాల బూచిని చూసి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం తప్ప, ప్రజల సంక్షేమం బిజేపికి పట్టదని తేలిపోయింది. ఇక ఇలాంటి కథలు నమ్మేందుకు దేశ ప్రజల సిద్దంగా లేరు. దేశంలో మసీదులను కూల్చుడు రాజకీయం నిర్మాణాలు చేసిన చరిత్ర బిజేపి నిఘంటువులోనే లేదు. ఎనమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. చెప్పుకోవడానికి ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదు. నిర్మాణం జరగలేదు. దేశం గర్వించదగ్గ స్ధాయిలో ఒక్క ఆసుపత్రి చేపట్టలేదు. దేశంలో అదనంగా వేసిన రైల్లే లైను లేదు. రోడ్ల విస్తరణను కూడా కొత్తరోడ్లు అని ప్రచారం చేసుకునే దిక్కుమాలని రాజకీయం బిజేపి మాత్రమే చేయగలదు. సామాన్యులు అందుబాటులో వున్న అనేక ప్యాసెంజర్‌ రైళ్లును రద్దు చేసి, వందేభారత్‌ అంటూ సామాన్యులు ఎక్కలేని రైళ్లను ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకోవడం బిజేపికే చెల్లింది. ఎంతో గొప్పగా రైల్లే బడ్జెట్‌ను, ఆర్ధిక బడ్జెట్‌ను కలిపి, దేశంలో ఇన్నేళ్లకు వందేభారత్‌ పేరుతో ప్రవేశపెట్టిన రైళ్లు 14. ఇదా ఒక ప్రభుత్వం చేయాల్సిన పని. పైగా అదే వందేభారత్‌ రైలును రాష్ట్రాలన్నీ తిరుగుతూ ప్రధాని మాత్రమే ప్రారంభించడం అన్నది గతంలో ఎన్నడూ లేదు. చెప్పుకోవడానికి ఏదీ లేదు. చేసింది లేదు. గత ఎన్నికల సమయంలో పుల్వామా ఘటనకు కారణం ఎవరో? ఏం జరిగిందో? అన్న విషయం తాగాజా అప్పటి జమ్ము కాశ్మీర్‌ గవర్నర్‌ చెప్పిన విషయాలతో బిజేపికి ఇక కాలం చెల్లినట్లే. పైకి బిజేపి చెప్పేదొకటి. చేసేదొకటి అన్నట్లు ప్రజల ముందు తెల్ల మొహం వేసుకునే రోజులు వచ్చాయి. సైనికులకు కనీసం హెలీకాప్టర్‌లు ఇవ్వకపోవడం మూలంగానే ఘోరం జరిగిపోయిందన్న సత్యం వెలుగులోకి వచ్చింది. 

ఇక ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చి దేశంలో ఖాళీ అయిన ఉద్యోగాలను కూడా నింపని బిజేపికి తెలంగాణలో ఓటు అడిగే హక్కు లేదు.

  ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలైన బండి సంజయ్‌ కౌంటింగ్‌ అయిపోగానే ఏడ్చి సానుభూతి సంపాదించి, పార్లమెంటుకు పోటీ చేసి గెల్చి కరీంనగర్‌కు ఏం చేశావో ముందు చెప్పు? కనీసం రైల్వే బ్రిడ్జి కూడా సాధించలేదు? అన్ని రంగాల్లో సమగ్రాభివృద్దితో, కలలో కూడా ఊహించనంత ప్రగతితో దేశంలోనే నెంబర్‌ వన్‌గా గుర్తింపు పొందిన తెలంగాణలోనే బిజేపి నేతల పిచ్చిగంతులు? అబద్దాల పునాదుల మీద నడిచే బిజేసి అసలు స్వరూపం ప్రజలకు ఎప్పుడో అర్ధమైపోయింది. కేంద్రం నుంచి ఒక్క రూపాయి తేలేని దద్దమ్మలను మరోసారి నమ్మేందుకు తెలంగాణ సమాజం సిద్దంగా లేదు. ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం అసలే లేదు. ఈసారి బిజేపికి కట్టగట్టి హుస్సేస్‌ సాగర్‌లో వేసుడే..? ప్రగతిని చూడలేని కళ్లు…బిజేపి పార్టీ నిండా కుళ్లు! ఇంతకన్నా ఆ కంపు గురించి చెప్పడం కూడా వృధానే! ఉత్తర ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో శాంతి భద్రతలు జనం చూస్తున్నాదే… ప్రజలు చీకొడుతున్నదే! అది కూడా గొప్పగానే ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకుందామని చూసే దుర్మార్గపు రాజకీయం బిజేపిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *