మన్నెకే మాట!

-దానం పార్లమెంటు బాట.

-గోవర్ధన్‌ రెడ్డికి హామీ?

-ఈసారి ఉద్యమ కారులకు ప్రాధాన్యత.

-ఆ క్రమంలో మన్నెకు ఛాన్స్‌!

-ఆది నుంచి పార్టీకి సేవలు.

-నగరంలో బిఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి.

-పార్టీ మీద అచెంచలమైన విశ్వాసం.

-ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఎంతో అభిమానం.

-ఖైరతాబాద్‌ లో ఉద్యమ నేతగా గుర్తింపు.

-ప్రజలకు అందుబాటులో వుండే నేతగా పేరు.

-ప్రజా సమస్యల మీద స్పందనతో మంచి పేరు.

-అటు పార్టీకి, ఇటు ప్రజలతో సత్సంబంధాలు.

-ఖైరతాబాద్‌ ను పార్టీకి కంచుకోట చేశారు.

-మంత్రి కేటిఆర్‌ కు అత్యంత సాన్నిహిత్యం.

-ముఖ్యమంత్రి కేసిఆర్‌ అడుగుజాడలు ఆచరణం.

– అను నిత్యం ప్రజల అందుబాటులో…

-అర్థ రాత్రి తలుపు తట్టినా స్పందించే గుణం.

-పేదల కోసం పని చేసే నైజం.

– ఉద్యమ నేతగా అజాతశత్రువు గా ‘మన్నె’నలు.

  హైదరబాద్‌,నేటిధాత్రి:  

మన్నె గోవర్ధన్‌ రెడ్డి ( ఖైరతాబాద్‌ ఎంజిఆర్‌) తెలంగాణ ఉద్యమ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేలేని నాయకుడు. ముఖ్యంగా హైదరాబాద్‌ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల్లో ముందువరసలో నిలిచిన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో యువకుడిగా చురుకైన పాత్ర పోషించిన మన్నె గోవర్ధన్‌ రెడ్డ ఖైరతాబాద్‌లో క్రియాశీలపాత్ర పోషించారు. అంతే కాదు పేదల ప్రజలకు నాయకుడయ్యాడు. ఒకనాడు ఖైరతాబాద్‌లో పేదల నాయకుడుగా పిజేఆర్‌ కు పేరుండేది. ఇప్పుడు అదే ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఎంజిఆర్‌ పేదల దేవుడుగా కొలుస్తున్నారు. కీర్తింబపడుతున్నాడు. పేద ప్రజల చేత అభిమాననాయకుడిగా కొనియాడబడుతున్నాడు. ఎందుకంటే మన్నె గోవర్ధన్‌ రెడ్డికి తెలంగాణ అంటే ఎంత ప్రేమో, ఉద్యమాన్ని అంత బాధ్యతగా భుజాల మీద వేసుకున్నాడు. మన్నెకు పేదలంటే ఎంత ప్రేమో అంతగా బస్తీల ప్రజలకు అండగా వుంటాడు. బస్తీలంటే ఆయనకు ఎనలేని ప్రేమ. పేదల సాధకబాధకాలు తెలుసుకొని వారికి సేవ చేయడం ఎంతో ఇష్టం. అందుకే ఆనాడు పిజేఆర్‌కు ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు అంత ప్రేమగా ప్రజలు ఎంజిఆర్‌ అని పిలుచుకుంటున్నారు. అంతగా ప్రజల్లో మమేకమైన నాయకుడు హైదరాబాద్‌ రాజకీయాల్లో లేరు. 

తెలంగాణలో ఉద్యమ కారులైన నాయకుల్లో కేటిఆర్‌, హరీష్‌రావు ఇలా చాలా మంది నాయకులున్నారు.

 అలా వారి ఆశయాలు, ఆచరణలను పేదల పట్ల వారికి వున్న అంకితభావం కూడా ఎంజిఆర్‌లో వుంది. అందుకే పేదలకు ఆయనంటే, ఆయన నాయకత్వమంటే ఎంతో అభిమానం. నిత్యం ఆయన ఇంటి ముందు ఎంతో మంది పేదలు ఉదయమే కనిపిస్తుంటారు. తమ సమస్యలు మన్నె గోవర్ధన్‌రెడ్డికి వివరిస్తుంటారు. కొన్ని సార్లు వాళ్లు తమ బస్తీలకు ఆహ్వానించి వారి సమస్యలు విన్నవిస్తుంటారు. ఇలా ప్రజల్లో ఒకడిగా, ప్రజలకు వున్న పెద్ద దిక్కుగా , వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకునే నాయకుడిగా, అండగా వుంటూ వారికి సేవలందిస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయనను అజాతశత్రువు అని కూడా అంటారు. ఆయన అన్ని వర్గాల ప్రజలతో ఆప్యాయంగా వుంటాడు. వివాదాల జోలికి ఎక్కడా వెళ్లరు. ఇతర రాజకీయ పార్టీలతో ఘర్షణలు వుండవు. కాని తెలంగాణ విషయంలో మాత్రం ఆయన ఎంతో దూకుడుగా వుండేవారు. హైదరాబాద్‌లో ముఖ్యంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ పార్టీని బలమైన పునాదుల మీద నిలపడంలో మన్నె గోవర్ధన్‌ రెడ్డి పాత్ర చాలా వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆడుగు జాడల్లో నడుస్తూ, ఆయన ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ, తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడిన తీరుతో అందరి ప్రశంశలు అందుకున్నారు.. ఇక మంత్రి కేటిఆర్‌ అంటే ఎనలేని అభిమానం. అందుకే కేటిఆర్‌ అంటే ప్రాణ సమానంగా అభిమానిస్తుంటాడు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో చేసిన జాగృతి కార్యక్రమాలతోపాటు, తెలంగాణ ఉద్యమానికి చేజేదోడు వాదోడుగా నిలిచిన నాయకుల్లో మన్నె ముందుండేవారు. ఇక ఇటీవల కవిత డిల్లీ లిక్కర్‌ కేసుల పేరుతో వేధింపులు చేస్తున్న బిజేపిని తూర్పారపట్టడంతో పాటు, అరెస్టు కూడా కాబడ్డాడు. ఇలా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబం అంటే ఎంతో అభిమానాన్ని పెంచుకున్న నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి. 

మన్నె గోవర్ధన్‌రెడ్డి ఉద్యమకారుడు, తెలంగాణ రాజకీయాలపై పట్టున్న నాయకుడే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఎంతో అవగాహన వున్న నాయకుడు గోవర్ధన్‌రెడ్డి.

 ఎందుకంటే దేశకాల మాన పరిసి ్ధతులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటుంటాడు. ముఖ్యంగా బిజేపి చేస్తున్న అరాజకీయాలును సునిశింగా గమనిస్తుంటాడు. బిజేపి చేసే తప్పులను ఎత్తి చూపడంలో అందరికంటే ముందు వుంటాడు. ఇక తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలపై పూర్తి స్ధాయి అవగాహన వున్న నాయకుడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద వున్న అభిమానంతో ప్రజలకు ఆ పధకాలు అందేలా చేయడంలో మన్నె గోవర్ధన్‌ రెడ్డి ఎప్పుడూ ముందుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ పధకాల మీద చాలా మంది నాయకులకు పట్టుండదు. కాని మన్నె గోవర్ధన్‌రెడ్డి మాత్రం వాటి మీద అవగాహన కల్గి వుండడమే కాకుండా, ప్రతిపక్షాలకు దీటైన సమాదానం ఇవ్వడంలో కూడా సిద్ధహస్తుడు. అందుకే మంత్రి కేటిఆర్‌ ఉద్యమ కాలం నుంచి మన్నెను ప్రోత్సహిస్తూ వుంటారు. ఆయన నాయకత్వం మీద వున్న నమ్మకంతో 2014 ఎన్నికల్లో మన్నెకు టిక్కెట్‌ పార్టీ ఇచ్చింది. కొద్ది తేడాతో పరాజయం పాలయ్యారు. 2018 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆదేశాలు, మంత్రి కేటిఆర్‌ సూచన మేరకు త్యాగం చేశారు. అప్పటి నుంచి ఎలాంటి పదవులు కూడా ఆశించకుండా ఎంతో అంకితభావంతో పార్టీకోసం పనిచేస్తున్న మన్నెకు ఈసారి ఖైరతాబాద్‌ టిక్కెట్‌ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా వున్న దానం నాగేందర్‌ను జాతీయ రాజకీయాలకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ వున్నట్లు తెలిసింది. అందుకే ఖైరతాబాద్‌ నుంచి పోటీకి సిద్దం చేసుకో…అన్న సంకేతాలు మన్నెకు అందినట్లు కూడా తెలుస్తోంది.   

  తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీలో ఈసారి సరికొత్త నాయకత్వాలు తెరమీదకు రానున్నాయి.

 ఒకనాడు తెలంగాణ కోసం సుధీర్ఘ పోరాటం చేసి, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కొంత మంది నాయకులకు సరైన ప్రాదాన్యాలు దక్కలేదు. అప్పటి పరిస్ధితులు, కొత్త రాష్ట్రం, పాలనాపరమైన అవసరాలు, ప్రతిపక్షాలను ఎదుర్కొనే ఎత్తుగడలు, ఇలా రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని అవకాశాలు అందలేదు. కాని ఈసారి వారందరికీ సరైన గుర్తింపునివ్వనున్నట్లు తెలిసింది. వారికి న్యాయం జరగనున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయడానికి, తెలంగాణ అంటే ఏమాత్రం ప్రేమ లేని బిజేపి కేంద్ర నాయకత్వం విషం కక్కుతూనే వుంది. బిజేపి మూలంగా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందనేది బిఆర్‌ఎస్‌ వాదన. అందుకే ఈసారి ఉద్యమ కారులను సరైన ప్రాధాన్యత కల్పించి, ఎన్నికలను ఎదుర్కొనాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. గత ఎన్నికల సమయంలోనే నిర్ణయం తీసుకున్నందున ఈసారి చాల స్ధానాల్లో ఉద్యమకారులకు పెద్ద పీట వేయనున్నారట. అందులో భాగంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిత్యం కృషి చేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డికి ఈసారి టిక్కెట్‌ ఖరారు చేయనున్నట్లు తెలిసి, బస్తీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టిక్కెట్‌ త్యాగం చేసిన మన్నె గోవర్ధన్‌ రెడ్డికి ఈసారి టిక్కెట్‌ ఇవ్వడం కూడా న్యాయం చేసినట్లౌవుందని మంత్రి కేటిఆర్‌ కూడా అభిప్రాయపడ్డట్లు ప్రగతి భవన్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పేదల నాయకుడిగా ఇప్పటికే ఎంతో పేరున్న మన్నె గోవర్ధన్‌రెడ్డి గెలుపు ఎంతో సునాయాసమౌతుందంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకున్న వున్న పేరుతోపాటు, 2014లో ఓటమి, 2018త్యాగం వెరసి, ఈసారి అన్ని రకాల సానుకూల అంశాలు తోడు కానున్నాయంటున్నారు. ఏదేమైనా ఈసారి ఉద్యమాకారులకు సరైన ప్రాదాన్యత కల్పించడాన్ని బిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ నాయకుడు మన్నె ప్రజా నాయకుడు కావాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటినుంచే ఆయన అభిమానులు ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టేందుకు సిద్దపడుతున్నారు. ఆల్‌దిబెస్ట్‌ అంటూ పార్టీ శ్రేణులు అభినందనలుకూడా తెలియజేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *