డీలర్‌ ఆదేశిస్తాడు!…అధికారులు పాటిస్తారు!?

`మంచిర్యాల జిల్లాలో శీను సమాంతర వ్యవస్థ.

`శీను బాధితులు వందల సంఖ్యలో వున్నారు?

`నేటిధాత్రి తో వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు!

`సిఎస్‌ గారు ఒక్కసారి శీను బాగోతం వినండి.

`ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కక్కించండి. 

`మైనింగ్‌ లో రికవరీ కాని ఏకైక వ్యక్తి శీను.

`అధికారులను శాసించే శీను.

`శీను కరుణ వుంటే సీట్లో వుంటారు?

`శీను చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్‌ ఫర్‌ అవుతారు?

`ఓ ఐపిఎస్‌ ఆఫీసర్‌ ను పది రోజుల్లో ట్రాన్స్‌ఫర్‌ చేయించాడు?

`ఉమ్మడి రాష్ట్రంలో ఓ ఏఎస్పి డాన్‌ శీన్‌ ను ఉతికి ఆరేశాడు!

`దెబ్బకు శీను చరిత్ర సితారయ్యింది.

`భయానికి కొంత కాలం కనుమరుగయ్యాడు!

`ఆ అధికారి వెళ్లగానే మళ్ళీ మొదలుపెట్టాడు?

`తాజాగా బాల్క సుమన్‌ భయానికి హైదరాబాదు పారిపోయాడు!

`అయినా ఆగడాలు ఆపడం లేదు!

`డిఫాక్టో తహిసిల్తార్‌ గా కొన్ని మండలాలలో ఎంతో మంది భూములు ఆక్రమించుకుంటున్నాడు.

`ఎవరి భూమి రిజిస్ట్రేషన్‌ కావాలన్నా ముందు శీనుకు కలవాలట!

`పర్మిషన్‌ తీసుకోవాలట!

`డాన్‌ శీన్‌ కు సహకరించి ఇరుకున్న ఆర్మీవో…!

`రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేయాల్సిన పరిస్థితి!

`ఆర్డీవో వీడియో వైరల్‌!

`హైదరాబాద్‌ లోని బండ్లగూడలో మకాం… ఫోన్లలో వ్యవహారం.

`కొత్తగా వచ్చిన అధికారులను కోట్లిచ్చైనా ప్రసన్నం చేసుకుంటాడు!

`ఆ తర్వాత వాళ్లను గుప్పిట్లో పెట్టుకుంటాడు!

`మొత్తం రెవెన్యూ వ్యవస్థ లో శీను చక్రం తిప్పుతున్నాడు?

`సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్నాడు?

`ఇసుకాసురతో చేతులు కలిపి, అధికారులు భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకుంటున్నారు.

`శీను పారిపోయినా పనులు చేసిపెడుతున్నారు.

`ముడుపులు ముసిముసిగా తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అతనేమీ స్వాతంత్య్ర సమరయోధుడు కాదు. తెలంగాణ ఉద్యమకారుడు కాదు. సామాజిక వేత్త అంతకన్నా కాదు. అ జిల్లాలో సీనియర్‌ పొలిటీషియన్‌ కాదు…కనీసం నాయకులకు తోడ్పాటు అందించే వ్యక్తి కూడా కాదు. పాపాల బైరవుడు. అరాచకాలకు అడ్డా అతను. పేద ప్రజలను పీడిరచుకుతింటున్న పాపాత్ముడు. సమాజానికి చీడ పురుగు. అతనో సమాంతర వ్యవస్థ. మంచిర్యాల జిల్లాలో అతనో పవర్‌ పుల్‌ మ్యాన్‌. పేరుకు మాత్రం అతను డీలర్‌….జస్ట్‌ డీలర్‌ శ్రీను….అధికారుల దృష్టిలో అతను కల్పవృక్షం. అందరూ చెప్పుకుంటున్నట్లు అతని మరో పేరు డాన్‌ శ్రీను…అధికారులకు అడిగింది ఇస్తాడు. ఏ కోరికైనా తీర్చుతాడు. కోట్లు ఖర్చైనా వెనుకాడడు. ఎంత పెద్ద స్థాయిలో వున్న అధికారి అయినా సరే అతని మాటలకు పడిపోవాల్సిందే. అలా అందర్నీ మెస్మరైజ్‌ చేయగలడు. నోట్ల ఆశ చూపగలడు. ఆఖరుకు ఎంతటి స్థాయి అధికారినైనా కొనేయగలడు. గుప్పిట్లో పెట్టుకోగలడు. దాంతో అధికారులు అతను ఏం చేయమంటే అది చేసి పెడతారు. కనీసం కాదని కూడా అనలేరు. అంతలా వారిని ఆడిరచగలడు. అతని ముందు ఏ అధికారి న్యాయం, ధర్మం అని ఎదురుచెప్పకూడదు. అన్యాయమైన పనులు చేయలేమని చెప్పకూడదు. ఏ అధికారి బలహీనత ఏమిటో ముందే తెలుసుకుంటాడు. ఆడిరచడం మొదలు పెడతాడు. అప్పుడు ఎంత చెండాలమైన పనైనా చేసి పెట్టాల్సిందే…జనం జాగలు అతని పేరు మీద రాయాల్సిందే…అవసరమైతే దగ్గర కూర్చొని రాయించుకోగలడు. అంతటి సమర్థుడు. జనం దృష్టిలో దుర్మార్గుడు. పాపాత్ముడు. నీచుడు. చెండాలుడు. కానీ అధికారులకు ఇవేమీ అవసరం లేదు…డీలర్‌ శీను అదేశిస్తాడు…అధికారులు చేసి పెడతారు. ఆ జిల్లాలో అతను ఏది చెబితే…అది…ఎంత చెబితే అంత…సామాన్యుడు తన భూమి అమ్ముకోవాలన్నా అతని పర్మిషన్‌ కావాలి. కనీసం కుటుంబ సభ్యుల పేరుమీద మార్చుకోవాలనుకున్నా అతను సరే అనాలి. అతను తనకే కావాలంటే ఇచ్చేయాలి. లేకుంటే వారికి తెలియకుండా పట్టా మార్పు జరిగితే ప్రశ్నించొద్దు. కనీసం గోడు కూడా వెళ్లబోసుకోవొద్దు. అతని అనుమతి ముందే తీసుకోవాలి. లేకుంటే ఏ అధికారి పెన్ను కదలదు. అతని నుంచి ఫోన్‌ వస్తే తప్ప ఏ పని కాదు…అంతటి శక్తి వంతుడిని చేసింది ఎవరో కాదు. ఉద్యోగ వ్యవస్థ. ఒక అనామకుడు ఇచ్చే సొమ్ముకు ఆశపడి పని చేయడం మొదలు పెట్టిన అధికారులు, ఇప్పుడు అతనేం చెబితే అదే చేస్తామన్న స్థాయికి చేరుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దిగజారిపోయారు. ఆత్మాభిమానం అమ్ముకున్నారు. అతని చేతిలో కీలుబొమ్మలయ్యారు. ఇది మంచిర్యాల జిల్లాలో ఎవరిని కదిలించినా చెప్పే మాట. మంచిర్యాల జిల్లా వాసులు ఏమైనా ఆటవిక రాజ్యంలో బతుకుతున్నారా? అన్న అనుమానం రావొచ్చు? కానీ డాన్‌ శీను చెప్పు చేతుల్లో బతుకుతున్నారని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. వ్యవస్థలన్నీ లొంగిపోయాక అతను చెప్పిందే వేదం…చేసిందే శాసనం…జిల్లానే అతని రాజ్యం…భోజ్యం. 

శీను బాధితులు వందల సంఖ్యలో వున్నారు?

మంచిర్యాల జిల్లాలో ఎవరిని కదిలించినా శీను గురించి కథలు, కథలుగా చెబుతారు. వారు శీను వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు తెలుపుతూ బోరున విలపిస్తారు. అ తర్వాత అతను ఎంత కర్కోటకుడో తెలుపుతారు. తమను ఎన్నెన్ని ఇబ్బందులకు గురి చేశాడో తెలుపుతుంటారు. అధికారుల అండదండలు శీనుకు ఎలా వున్నాయో పూస గుచ్చినట్లు వివరిస్తారు. తమను చేసిన మోసం చెప్పుకుంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా శాపనార్థాలు పెడుతుంటారు. నేటిధాత్రి తో వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు! డాన్‌ శీను బాధితులు అనేక మంది నేటిధాత్రిలో వస్తున్న కథనాలు చూసి ఫోన్లు చేస్తున్నారు. హైదరాబాదు కార్యాలయానికి బాధితులు క్యూ కడుతున్నారు. జిల్లాలో శీను మోసం చేసిన వాళ్ల లిస్ట్‌ చాలా పెద్దది. కొన్ని వందల కుటుంబాలు శీను చేతిలో బలయ్యాయి. 

సిఎస్‌ గారు ఒక్కసారి శీను బాగోతం వినండి.ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కక్కించండి.

మైనింగ్‌ లో రికవరీ కాని ఏకైక వ్యక్తి శీను. సహజంగా అక్రమ మైనింగ్‌ విషయంలో ఎంతటి వాళ్లైనా సరే, తప్పు జరిగిందని తేలితే తిరిగి ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఒక్క శీను విషయంలో మాత్రం అది జరగలేదు. ప్రభుత్వ వ్యవస్థలోనే ఇదొక సంచలనమనే చెప్పాలి. సహజంగా ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు అధికారులు కాస్త అత్యుత్సాహం కనబర్చడం చూస్తుంటాం. కానీ ఇక్కడ చడీ లేదు…చప్పుడు లేదు. శీనుకు నోటీసులిచ్చింది లేదు. కేసు నమోదైనా పట్టించుకున్నది లేదు. విజిలెన్స్‌ ఎంక్వైరీ పూర్తయ్యి ఐదేళ్లు గడిచిపోయింది. అధికారుల దగ్గర రిపోర్ట్‌ కూడా వుంది. అయినా అధికార గణం కదిలింది లేదు. శీను దగ్గర నుంచి రికవరీ చేసింది లేదు. వందల కోట్లు రికవరీ చేయకుండా అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారనేది నేటిధాత్రికి అందిన సమాచారం. అసలు అధికారులనే శీను శాసిస్తుంటే, వాళ్లు మాత్రం ఏం చేయగలరని కూడా మంచిర్యాలలో జనం మాట్లాడుకోవడం గమనార్హం.శీను కరుణ వుంటే సీట్లో వుంటారు. లేకుంటే లేదు అన్నట్లుగా వ్యవస్థను మొత్తం గుప్పిట్లో పెట్టుకుంటే అధికారులు మాత్రం ఏం చేయగలరు. పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా శీను మాటే చెల్లుబాటు అవుతుంటే చేష్టలుడిగి చూడడం తప్ప ఏమీ చేయలేరు. అంతే కాదు శీను చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్‌ ఫర్‌ అవుతారు? ఒక దశలో ఓ ఐపిఎస్‌ ఆఫీసర్‌ శీను చెప్పినట్లు వినలేదట. అంతే పది రోజుల్లో నీకు స్థాన చలనం తప్పదని హెచ్చరించాడట. అన్నట్లుగా ఆ ఐపిఎస్‌ ఆఫీసర్‌ ను పది రోజుల్లో ట్రాన్స్‌ఫర్‌ చేయించాడు? అని టాక్‌. 

ఎప్పుడూ మన రోజులే వుంటాయా? 

ఒకసారి చీకటి…ఒకసారి వెలుగు. అప్పుడప్పుడు కొన్ని సార్లు మబ్బులు కమ్మేస్తుంటాయి. అందరిలాగే ఓ ఏఎస్పీని కూడా శీను బెదిరించాలని చూశాడు. కానీ ఆ ఎఎస్పీ వద్ద డాన్‌ శీను పప్పులు ఉడకలేదు. డీలర్‌ రోజులు గుర్తొచ్చేలా, బంగాళాదుంప ఉడికించినట్లైందట. ఏఎస్పీ దెబ్బకు శీను చరిత్ర సితారయ్యింది. నగర బహిష్కరణ అనుభవించాడు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆ ఎఎస్పీ వున్నంత కాలం శీను కనిపించకుండా పోయాడు. అధికారి అన్నాక ఎల్ల కాలం అక్కడే వుండడు కదా! అతను ట్రాన్స్‌ఫర్‌ అయి వెళ్లిపోయాడు. మళ్లీ డీలర్‌ శీను డాన్‌ శీను అవతారం మళ్లీ మొదలుపెట్టాడు. తాజాగా బాల్క సుమన్‌ భయానికి మంచిర్యాల వదలి హైదరాబాదు పారిపోయాడు! బండ్ల గూడలో మకాం పెట్టాడు. అయినా ఆగడాలు ఆపడం లేదు! చేయాల్సిన పనులన్నీ హైదరాబాదు లోని తన ఇంటి నుంచే అన్నీ చక్కదిద్దుతున్నాడని సమాచారం. చీమ చిటుక్కుమన్నా అధికారులు క్షణాల్లో శీనుకు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే రెవెన్యూ వ్యవస్థ మొత్తం అతని కనుసన్నల్లోనే నడుస్తోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. డిఫాక్టో తహిసిల్తార్‌ గా కొన్ని మండలాలలో ఎంతో మంది భూములు ఆక్రమించుకుంటున్నాడు.ఎక్కడా లేని విధంగా , మహిష్మతి సామ్రాజ్యంలో నా మాటే శాసనం అన్నట్లు శీను కూడా అంటుంటాడట.ఎవరు కొత్తగా భూమి కొనుక్కోవాలనుకున్నా ముందు శీనును కలవాలట. ఇది ఆర్డర్‌. అధికారులు కూడా కలం కదల్చాలంటే ముందు ఈ మాటే చెబుతారట. ఎవరి భూమి రిజిస్ట్రేషన్‌ కావాలన్నా ముందు శీనుకు కలవాలట! లేకుంటే రిజిస్ట్రేషన్‌ అయ్యే ముచ్చటే లేదు. తమ సొంత భూమి బదలాయింపైనా సరే పర్మిషన్‌ తీసుకోవాలట! తహసీల్దారు కార్యాలయానికి, రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫైలు విషయం వివరంగా క్షణాలలో శీనుకు తెలియాల్సిందే. అంతే కాదు రియలెస్టేట్‌ వ్యాపారం మొత్తం అతని కనుసన్నల్లోనే జరగాలంట. 

డాన్‌ శీన్‌ కు సహకరించి ఇరుకున్న ఆర్డీవో…! 

ఉన్నత స్థాయి ఉద్యోగం. అయితే ఏమిటి? కాసులకు కక్కుర్తి పడ్డాడు. డీలర్‌ శీనుకు అడుగడుగునా ఉపయోగపడ్డాడు. నిజానికి ఆ స్థాయి అధికారి పేదలకు అండగా నిలవాలి. ప్రజలకు మేలు చేయాలి. డాన్‌ శీను లాంటి వాళ్లను గడగడలాడిరచాలి. కానీ ఆర్డీవో అయినప్పటికీ శీనుకు లొంగిపోయాడు. కాసులకు దాసోహమయ్యాడు. శీనుకు సాయం చేశాడు. తప్పుడు మార్గం అనుసరించాడు. చేయకూడని పనులన్నీ శీనుకు చేసిపెట్టాడు. తప్పుడు లెక్కలు అనుసరించాడు. తప్పులు చేయడం అలవాటు పడ్డాక శీను విషయంలో జిల్లా కలెక్టర్‌ మీద నోరు జారి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసుకోవాల్సి వచ్చింది. ట్రాన్స్‌ఫర్‌ కొని తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన మాట్లాడిన ఓ విషయం జనాలకు చేరింది. వీడియో వైరల్‌ అయ్యింది. ఆర్డీవో పని అయిపోయింది.సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్నాడు? ఇసుకాసురతో చేతులు కలిపి, అధికారులు భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకుంటున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఆర్డీవో లాగా ఇబ్బందులు పడకతప్పదని తెలిసినా, తప్పుడు పనులలో సాయం ఆపడం లేదు. శీను పారిపోయినా పనులు చేసిపెడుతున్నారు. ముడుపులు ముసిముసిగా తీసుకుంటున్నారు. ఎప్పుడో పాపం పండకపోదు. పాపాల పుట్ట పగలకపోదు. పాపాత్ముడికి సాయపడిన వారికి శిక్ష తప్పదు. పాపాల బైరవుడు డాన్‌ శీనుకు ఆగడాలకు మూల్యం చెల్లక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *