కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ ఘన విజయాలు సాధించాలని, యావత్ దేశం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసిన రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు
వారితో కలిసి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, వాస్తుశిల్పి ముద్దు వినోద్, వ్యాపారవేత్త సుధీర్
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని గురువారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.తమ కుటుంబ గోత్ర నామాలతో అర్చన చేసి,ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకొల్పిన బీఆర్ఎస్ గొప్పగా బలపడాలని,ఘన విజయాలు సాధించాలని,రాష్ట్రంతో పాటు యావత్ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ తల్లిని వేడుకున్నారు.ఈ సందర్భంగా వేద పండితులు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులకు శాలువలు,పట్టు వస్త్రాలు బహుకరించారు.మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ప్రముఖ వాస్తుశిల్పి ముద్దు వినోద్, వ్యాపారవేత్త సుధీర్,శ్రేయోభిలాషి ట్రస్ట్ వ్యవస్థాపక ఛైర్మన్ విష్ణు జగతి తదితరులు రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులతో కలిసి ఈ పూజల్లో పాల్గొన్నారు.అంతకుముందు వారికి ఆలయ అధికారులు,వేద పండితులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.