అబ్బాయిదేమో ఇండియా, చైనాకు చెందిన అమ్మాయి కలుసుకున్నది కెనడా
కలిపినది సాఫ్ట్ వేర్ రంగం
భారతీయ సంప్రదాయబద్ధంగా వారిద్దరూ ఒకటయ్యారు
వరంగల్ తూర్పు డిసెంబర్17
ప్రేమకు ఎల్లలు అనేవి ఉండవని మరోసారి నిరూపితమైంది.ఇండియాకు చెందిన అబ్బాయి, చైనా నుంచి వెళ్లిన అమ్మాయి ఇద్దరు కెనడాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ గా ఒకేచోట పని చేస్తున్న పరిచయం ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటవ్వాలన్న నిర్ణయానికొచ్చి తమ తల్లిదండ్రులను ఒప్పించి ఇండియా బయలుదేరారు.ఖమ్మం జిల్లాకు చెందిన ఆదిరాజు జనార్దన్ రావు,శైలజల చిన్న కొడుకు వెంకట శివగణేష్ సాకేత్, చైనాకు చెందిన హానూ టంగ్,హే టంగ్ ల కూతురు ట్రెసీలు కెనడాలో ఉద్యోగం చేస్తూ ప్రేమించుకుని తెలంగాణలోని హనుమకొండలో పెళ్లి పీటలెక్కారు.హనుమకొండలోని కే యూ శుభం కళ్యాణ వేదికలో శనివారం వారి తల్లిదండ్రులు,పెద్దల సమక్షంలో భారతీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయబద్ధంగా వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ఒకటయ్యారు.మంగళ వాయిద్యాల మధ్య పెద్దలందరూ అక్షింతలు వేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెళ్లి కుమారుని చిన్ననాటి స్నేహితుడు వద్దిరాజు నిఖిల్ చంద్ర వివాహ తంతు మొదలై ముగింపు వరకు ఉండి శుభాకాంక్షలు తెలిపారు