టిఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడైపోయింది: ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌

`మెజారిటీ ఎంతనేదే లెక్కలేయాలి.

`మునుగోడులో కారు జోరు…ప్రతిపక్షాలు బేజారు

`కట్టాతో చౌటుప్పల్‌ నుంచి ఎమ్మెల్యే నరేందర్‌.

`ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడో సర్థేసుకున్నాయి..

`ప్రతిపక్షాలను ప్రచారానికి కూడా ప్రజలు రానివ్వడం లేదు.

`రాజగోపాల్‌ రెడ్డి నైతే తరిమికొడుతున్నారు.

`గ్రామాలలోకి రాజగోపాల్‌ రెడ్డిని రావొద్దనే అంటున్నారు.

`ఇక కాంగ్రెస్‌ ప్రచారం నుంచి ఎప్పుడో తప్పుకున్నది.

`పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు.

`నాయకులంతా రాహుల్‌ గాంధీ భజనకు వెళ్లారు.

`మునుగోడు ప్రచారం చేసినా గెలిచేది లేదన్నది తెలిసిపోయింది.

`టిఆర్‌ఎస్‌ ప్రచారం జోరుగా సాగుతోంది.

`ప్రజలు టిఆర్‌ఎస్‌ కు బ్రహ్మరథం పడుతున్నారు.

`రాజగోపాల్‌ ను నమ్మి మోసపోయామంటున్నారు.

`మునుగోడు జనమంతా టిఆర్‌ఎస్‌ వైపే…

`కేసీఆర్‌ నాయకత్వం కోసమే…

మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలుపు ఎప్పుడో డిసైడైపోయింది. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేసినందుకు మధనపడుతున్నామని కూడా చెబుతున్నారు. ఏదేమైనా ఆఖరుకు మంచే జరుగుతోందని, ప్రజలకు సేవ చేయలేనని రాజగోపాల్‌రెడ్డి చేతులెత్తేయడమే మంచిదైదందని ప్రజలు చెబుతున్నారు. అభివృద్ధి చేసే ఎమ్మెల్యేను కాదనుకున్నందుకు నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. అందుకే ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తామని మునుగోడు నియోజకవర్గ ప్రజలు డిసైడైపోయారు. ఇప్పుడు బిజేపి, కాంగ్రెస్‌లు ఎంత మొత్తుకున్నా లాభం లేదు. అంటున్న వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో మునుగోడు ప్రచార సరళిని పరిశీలిస్తున్న కట్టా రాఘవేంద్రరావు. ఈ సందర్భంగా నన్నపనేని మాటల్లోనే…

                              మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ విజయం ఆగేది కాదు. ఆపేంత శక్తి బిజేపి, కాంగ్రెస్‌లకు లేదు. ప్రజల్లో వారికి స్ధానమే లేదు. ప్రజలు వారిని దగ్గరకు కూడ రానివ్వడం లేదు. ముఖ్యంగా రాజగోపాల్‌నైతే ప్రజలు ఆయా గ్రామాల్లో అడుగుపెట్టనివ్వడం లేదు. ఆయన వస్తున్నారని తెలిసిన వెంటనే ఊరు శివారులోనే ఆయన ఆపేస్తున్నారు. నిలదీస్తున్నారు. తరుముతున్నారు. రూ.18వేల కోట్ట కాంట్రాక్టుకోసం మునుగోడు ప్రజల ఆత్మాభిమానం తాకట్టు పెట్టావంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా సాగనంపుతున్నారు. ఇదే దశలో ఓ గ్రామంలో రాజగోపాల్‌ రెడ్డి ప్రజలు భయపెట్టే ప్రయత్నం చేయడంతో వున్న ఏ కొద్దోగొప్పే సానుభూతి కూడా లేకుండా చేసుకున్నాడు. టిఆర్‌ఎస్‌ది వన్‌ సైడ్‌ గెలుపుగా మారేందుకు ప్రజలే రాజగోపాల్‌రెడ్డిని అడుగు కూడ పెట్టనీయడంలేదు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో చేస్తున్న ప్రచారంలో మెజార్టీ ఎంత వస్తుందన్నదానిపై లెక్కలేసుకుంటున్నామంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్లినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ గురించే చెబుతున్నారు. తెలంగాణ రాకముందు మునుగోడు ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుందనేది ప్రజలే విరిస్తుంటే ఎంతో సంతోషమనిస్తుంది. మునుగోడు ప్రజల్లో వున్న చైతన్యం అంతా ఇంతా కాదు. తాను ప్రచారం చేస్తున్న చౌటుప్పల్‌లో ప్రజలు ఎంతో విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. సహజంగా ఎక్కడైనా సరే… ఏ ఎన్నికల్లోనైనా సరే…ప్రచారానికి వెళ్లిన సందర్భాలలో సరే..సరే అంటుంటారు. కాని మునుగోడు నియోజకవర్గంలో ప్రజలే తమకు హమీ ఇస్తున్నారు. ప్రచారం చేసేవారు చెప్పాల్సిన మాటను, ప్రజలు మాకు చెప్పి మాట ఇస్తున్నారు. మీరు నిశ్చింతగా వుండడి. మేము టిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామని మాలోనే మరింత ఆత్మస్ధైర్యాన్ని నింపుతున్న మునుగోడు ఓటర్లపై మరింత గౌరవం పెరిగింది. తెలంగాణ రాక ముందు వారి గోసలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల తాము ఎంత లబ్ధిపొందామో ఒక్కక్కటీ చెబుతున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాక ముందు మంచనీళ్లు తాగాలన్నా భయపడే పరస్దితి. కాని ఇప్పుడు ఫ్లోరైడ్‌ అన్నది లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎంత మొత్తుకున్నా గుక్కెడు మంచినీళ్లు ఇయ్యలే…ఇప్పుడు నిత్యం మంచినీళ్లు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు పిల్లనియ్యాలంటే ప్రజలు భయపడేవారు. అలాంటిది ఇప్పుడు మునుగోడులోని అన్ని గ్రామాలు సురక్షితమైన మంచినీరు అందుతోంది. ఇదీ ప్రజలు చెబుతున్న మాట. 

                        ఇక తన స్వార్ధం కోసం మునుగోడులో రాజీనామా చేసి, ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్‌ మళ్లీ అబద్దాలు షురూ చేశాడు. అవి కనీసం నమ్మశక్యంగానైనా వుండాలి. నిజానికి పార్లమెంటు నియోజకర్గ ఉప ఎన్నికైతే జాతీయ స్దాయిలో అధికారంలో వున్న పార్టీ అభ్యర్ధి అయితే ఏవైన వాగ్ధానాలు చేస్తే కొంత వరకు నమ్మొచ్చు. అంతే కాని అసెంబ్లీ నియోజకరవర్గానికి పోటీ చేస్తూ, కేంద్రం నుంచి నిధులు తెస్తానంటే సాధ్యమయ్యే పనేనా? ప్రజలు ఆ మాత్రం ఆలోచించుకోలేరా? ప్రజలను ప్రతీసారి మోసం చేయలేరు. ఇక్కడ ఓ విచిత్రమైన విషయం చెబుతాను. చౌటుప్పల్‌లో పది పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి తెప్పిస్తానని రాజగోపాల్‌రెడ్డి ఇటీవల మ్యానిఫెస్టో విడుదల చేశాడు. ఎక్కడైనా పది పడకల ఆసుపత్రి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? అందులోనూ పది పడకల ఆసుపత్రికి ఈఎస్‌ఐ ఆసుపత్రి సౌకార్యలు ఇవ్వడం సాధ్యమౌతుందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఆసుపత్రులు కనీసం ముప్పై పడకలు వుంటాయి. ఇక కేంద్రం ప్రకటించే ఆసుత్రులు ఎయిమ్స్‌ స్ధాయిలో వుండాలి. రాజగోపాల్‌రెడ్డి అన్న అయిన వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా వున్నాడు. ఆయన బీబీ నగర్‌ నిమ్స్‌కు ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్ని నిధులు తెచ్చాడు. నిమ్స్‌లో వైద్య సేవలు మొదలయ్యేలా ఎంత కృషి చేయలేదు. ఈ విషయం చెప్పే దమ్ము రాజగోపాల్‌కు వుందా? ఆలు లేదు..చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం అన్నట్లు మునుగోడులో మళ్లీ గెలిచినట్లు, కేంద్రం నుంచి నిధులు తెచ్చినట్లు రాజగోపాల్‌ ఇప్పుడే పగటి కలలు కంటున్నాడు. అవన్నీ అబద్దాలని ప్రజలకు తెలుసు. రాజగోపాల్‌రెడ్డి వల్ల ఏదీ కాదని కూడ తెలుసు. అందుకే ఎక్కడికెళ్లినా రాజగోపాల్‌కు చుక్కెదురౌతుంది. ప్రచారమే చేసుకునే వీలు లేకుండాపోతున్నది. 

                  ఇక ఇదిలా వుంటే రాష్ట్ర రాజకీయాల్లో అనైతిక రాజకీయాలకు బిజేపి పార్టీ పాల్పడుతుందో కనిపిస్తోంది. ప్రజలు బిజేపిని చీ కొడుతున్నారు. అబద్దాల పునాదుల మీద పార్టీని ఎల్ల కాలం బిజేపి నడలేదు. ఎమ్మెల్యేలకు వల వ్యవహారంలో తొలి రోజు బిజేపి నాయకులు చెప్పిందేమిటి? ఇప్పుడు చెబుతున్నదేమి? సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఆ రోజు అసలు ఆ ఫోటోల్లో వున్నవారు ఎవరో తెలియదన్నాడు. ఈరోజేమో! అందులో తప్పేముంది? అంటున్నాడు. ఇంత కన్నా నీచాతి నీచమైన రాజకీయాలు ఎవరైనా చేస్తారా? ఇంత దిగజారుడు తనం అవసరమా? రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే ప్రజల మద్దతుండాలి. వారి ఆశీర్వాదం కావాలి. ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అంతే కాని ప్రజల్లో మద్దతు లేకున్నా, వారి ఆశీర్వాదం లేకుండా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం దుర్మార్గం. మహారాష్ట్ర, గోవా, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, త్రిపుర, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలలో ఏం జరిగిందో తెలంగాణలో కూడా చేద్దామనుకున్నారు. కాని ఇక్కడు వున్నది తెలంగాణ సాధకుడు. సుధీర్ఘమైన పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమ కారుడు. రాజకీయ చాణక్యుడు. కేసిఆర్‌ వున్నాడు. ఆయను సూటిగా చూడడమే ఎవరి వల్లా కాదు. ఆయన రాజకీయ చతురత ముందు ఎవరూ నిలబడలేరు.

                  దేశంలో ఏ రాష్ట్రంలో లేని , అమలు కానటువంటి సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి తెలంగాణ మేమూ భాగస్వాములం కావలంటే మా ప్రాంతాలను కూడా తెలంగాణలో కలపమని పొరుగు రాష్ట్రాల ప్రాంతాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అలాంటి తెలంగాణలో అస్ధిర రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలే బిజేపిని చీరి చింతకు కట్టేస్తారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వకుండా, తెలంగాణకు గతంలో కేటాయించిన ప్రాజెక్టులు తరలించుకుపోయారు. తాజాగా విమానాల తయారీ ప్రాజెక్టును కూడా గుజరాత్‌కే కేటాయించుకున్నారు. అడుగడుగునా తెలంగాణను మోసం చేస్తున్న బిజేపికి తెలంగాణలో చోటు లేదు. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి ఓటు కూడా పడదు. మునుగోడులో బిజేపి గోడు ఎవరూ పట్టించుకోరు సరి కదా…ఓటంటూ ఎవరైనా వస్తే ప్రజలు గోడకేసి కొడుతున్నారు. టిఆర్‌ఎస్‌ గెలుపును ప్రజలే ఖాయం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!