వరంగల్ జిల్లా, నేటిధాత్రి : ఎనుమాముల మార్కెట్ లో శనివారం రోజున బీహార్ ,చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేస్తున్న ఇండియన్ డిసైపోల్ మిషన్ ఆధ్వర్యంలో. గత.నెల రోజుల నుండి. పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లిన. వరంగల్ జిల్లా ఎస్సీ/ ఎస్టీ. అట్రాసిటీ. విజిలెన్స్. అండ్. మంటరింగ్ కమిటీ మెంబర్.
మరియు. వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న,నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ అక్కడి వాతావరణం పిల్లల పరిస్థితి చూసి బాధ చెందడంజరిగింది. పిల్లలకు సరిగా బట్టలు లేకపోవడం అనారోగ్యంతో ఉండడం. శుభ్రత లేకపోవడం చూశాను చదువు ఏమాత్రం లేకపోవడం చూసి. బాధపడ్డాను. వీరికి తక్షణమే .స్కూలుకు అవసరమైన గది సౌకర్యం కావాలివీడి పరిస్థితిని చూసి. బాధపడి నేను జిల్లా కలెక్టర్ గోపికి ఈ విషయం తెలపరుస్తానని శుభ్రత కోసం శనివారం రోజున సబ్బులను ఇచ్చినాను ఇట్టి పాఠశాలను నిర్వహిస్తున్న. కలకోట్ల,స్వామి దాస్ ,ఝాన్సీ దంపతులు,పోలేపాక సుమన్ పుష్ప. దంపతుల ,సేవలు మరువలేనివి.
ఈ పాఠశాలలో,సుమారు 65 మంది ,పిల్లలకు ,విద్యాబోధనలు. అందిస్తున్నారు.